Stop Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం ఆపేయండి.. సైకతశిల్పంతో సందేశం!

Stop Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్​ పట్నాయక్​ కొత్త సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్​గా మారుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 04:25 PM IST
  • రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం
  • యుద్ధం ఆపేయాలంటూ సూచిస్తున్న ప్రతిమలు
  • ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తుల్లో ఇదే అభిప్రాయం
Stop Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం ఆపేయండి.. సైకతశిల్పంతో సందేశం!

Stop Russia-Ukraine War: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తపంగా చర్చించుకుంటున్న అంశం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఆధునిక యుగంలో ఇలా రెండు దేశాలు యుద్ధానికి దిగటం అనేది చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధం రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రజలపైనే కాకుండా.. పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని ప్రభావితం చేస్తోంది.

కోట్లాది మంది ప్రజలు యుద్ధం ఆపేయాలంటూ కోరుకుంటున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా యుద్ధం ఆగిపోవాలంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక మన దేశానికి చెందిన ప్రముఖ సైకత శిల్పకారుడు, పద్మ శ్రీ గ్రహిత సుదర్శన్​ పట్నాయక్​ కూడా యుద్ధం ఆపేయాలని ఆకాంక్షిస్తూ తాజాగా ఓ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరీ తీరంలో రూపొందించిన ఈ సైకత శిల్పానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆలోచింపజేస్తున్న సైకతశిల్పం..

ఓవైపు రష్యా జాతీయ పతాకం దానిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ ప్రతిమ, మరోవైపు ఉక్రెయిన్ జెండా, ఆ దేశ ప్రెసిడెంట్​ వొలొదిమిర్​ జెలన్​స్కీ ప్రతిమిలు ఉన్నాయి. మధ్యలో యుద్ధం వల్ల జరగుతున్న వినాశనాన్ని ప్రతిభింబించేలా అగ్ని, ఓ చిన్నారి ప్రతిమలు ఉన్నాయి. దానిపై స్టాప్​ వార్​ అని ఇంగ్లీష్​లో రాసి ఉంది.

Also read: Panda Funny Video: క్యూటీ పాండా ఇందులో ఏం చేస్తుందో చూడండి- వీడియో వైరల్

Also read: Kacha Badam Trend: కచ్చా బాదమ్ పాటకు నెపాలీ చిన్నారి స్టెప్పులు- వీడియో వైరల్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News