Viral Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కొండ చిలువల మధ్యపడుకుని ఇలా చేస్తున్నాడేంటీ.. వైరల్ గా మారిన ఘటన..

Heavy Pythons: జే బ్రూవర్ పాములను, కొండ చిలువలను ఇట్టే పట్టేసుకుంటాడు. ఇప్పటికే అనే కొండచిలువలను పట్టుకుని తన ఇన్ స్టా ఖాతా పోస్టులు కూడా పెడుతుంటాడు. తాజాగా, ఆయన కాలిఫోర్నియాలోని ఫౌంటెన్ వ్యాలీలోని సరీసృపాల జంతుప్రదర్శనశాలలో కొండ చిలువలతో కన్పించి అందరిని షాకింగ్ కు గురిచేశాడు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 17, 2024, 08:35 PM IST
  • - కొండ చిలువలను వాటేసుకుని ఆటలు..
    - భయంతో నోరెళ్ల బెడుతున్న నెటిజన్లు..
Viral Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కొండ చిలువల మధ్యపడుకుని ఇలా చేస్తున్నాడేంటీ.. వైరల్ గా మారిన ఘటన..

Brewer Sitting Silently In The Middle Of Pythons: మనలో చాలా మంది పాములు, కొండ చిలువలను చూస్తే భయంతో వణికిపోతుంటారు. పొరపాటున ఎక్కడైన పాము కన్పిస్తే అక్కడికి వెళ్లటం కూడా మానేస్తారు. చీకట్లో తాడును చూసి పామని చాలా మంది భయపడుతుంటారు. కానీ మరికొందరు మాత్రం.. పాములు, కొండ చిలువులతో ఒక ఆడేసుకుంటారు. చిన్నప్పటి నుంచి పాములను పట్టుకొవడంలో స్పెషల్ ట్యాలెంట్ ను కల్గి ఉంటారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

ఎక్కడ పాములు కన్పించిన, సమాచారం రాగానే అక్కడికి వాలిపోయి చాకచక్యంగా పాములను పట్టేసుకుంటారు. పాములు లేదా కొండ చిలువలతో ఎలా ప్రవర్తించాలో వీరికి పూర్తిగా అనుభయం ఉంటుంది. అందుకే పాములు, కొండ చిలువలను మెడలో వేసుకుంటూ..  ఒళ్లొ వేసుకుంటూ ఆడుకుంటారు. ఇలాంటి వీడియోలు తరచుగా మనం చూస్తునే ఉంటాం. ఇప్పుడు మరో కొండ చిలువల వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

జేబ్రూవర్ పాములు, కొండ చిలువలతో చిన్నతనం నుంచి ఆడుకుంటాడు.ఇతనికి కొండ చిలువలంటే ఎంతో ఇష్టం. అందుకే జూలో కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ముఖ్యంగా పాములు, కొండ చిలువులను ఎలా హ్యండీల్ చేయాలో ఇతనికి పూర్తిగా అవగాహన  ఉంది.  ఇక.. కొండ చిలువలు కూడా తమ దోస్త్ అన్నట్లు ఇతనికి హనీ తలపెట్టవు. కొండ చిలువల మధ్యలో ఏదో స్విమ్మింగ్ పూల్ మధ్యలో పడుకున్నట్లు పడుకున్నాడు.

Read More: Iswarya Menon: ఎరుపెక్కిన అందాలతో హీటెక్కిస్తున్న ఐశ్వర్య మీనన్, లేటెస్ట్ పిక్స్ వైరల్

అతని పక్కన, శరీరంపై నుంచి భారీ కొండచిలువలు అటు ఇటూ వెళ్తున్నాయి. అదేదో అతగాడికి మసాజ్ చేస్తున్నట్లు అటూ, ఇటూ పాకుతున్నాయి. అతను కూడా భారీ కొండ చిలువల మధ్యన పడుకుని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాకింగ్ కు గురౌతున్నారు. నువ్వు తోపు బ్రో .. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News