విరాట్ కోహ్లీ, అనుష్క కేప్ టౌన్‌లో ఏం చేస్తున్నారో చూడండి!

సౌతాఫ్రికా సిరిస్ కోసం కేప్ టౌన్ వెళ్లిన విరాట్ కోహ్లీ తన బెటర్ హాఫ్‌తో అక్కడ ఏం చేస్తున్నారో చూడండి.

Last Updated : Jan 5, 2018, 01:06 PM IST
విరాట్ కోహ్లీ, అనుష్క కేప్ టౌన్‌లో ఏం చేస్తున్నారో చూడండి!

ఇటీవలే పెళ్లి చేసుకుని, ఇండియాలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ పార్టీ ఇచ్చి సౌతాఫ్రికా సిరిస్ కోసం కేప్ టౌన్ వెళ్లిన విరాట్ కోహ్లీ తన బెటర్ హాఫ్‌తో అక్కడ ఏం చేస్తున్నారో చూడండి. కేప్ టౌన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేస్తున్న ఈ సెలబ్రిటీ కపుల్‌ని కనిపెట్టిన అక్కడి వారు.. ఈ ఇద్దరినీ తమ మొబైల్ కెమెరాల్లో బంధిస్తూ కనిపించారు. అలా ఆన్‌లైన్‌లోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అక్కడున్న వాళ్లంతా తమనే చూస్తోంటే.. సిగ్గుతో చచ్చిపోయినట్టుగా అనుష్క వెంటే తలదించుకుని, ఆమె అడుగులో అడుగేస్తూ వెళ్తున్న విరాట్ కోహ్లీని చూస్తోంటే పాపం అనిపిస్తోంది కదూ!! 

 

ఇక విరాట్ కోహ్లీ సేన ముందున్న క్రికెట్ సవాళ్ల విషయానికొస్తే, సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన టీమిండియా.. 3 టెస్ట్ మ్యాచ్‌లు, 6 వన్డే మ్యాచ్‌లు, 3 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడనుంది. విదేశీ గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ ఎలాగైనా గెలిచితీరుతామని కోహ్లీ సేన ధీమా వ్యక్తంచేస్తోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 24వ తేదీ వరకు జరగనుంది.

Trending News