Viral Video: ప్రపంచాన్ని కదిలిస్తున్న ఉక్రెయిన్ చిన్నారి పాట, వీడియో వైరల్

Viral Video: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నెట్టింట ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి.  తాజాగా ఉక్రేనియన్ చిన్నారి పాడిన  పాట నెటిజన్ల చేత కన్నీరు పెట్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 07:45 PM IST
Viral Video: ప్రపంచాన్ని కదిలిస్తున్న ఉక్రెయిన్ చిన్నారి పాట, వీడియో వైరల్

Ukrainian Girl Singing Video Viral: ఉక్రెయిన్-రష్యా యుద్ధం (Russia Ukraine War) వల్ల లక్షల మంది ఉక్రెయిన్లు దేశాన్ని విడిచివెళ్లారు. ఇంకా చాలా మంది రైల్వే స్టేషన్లలోనూ, బంకర్లలోనూ చిక్కిపోయి... ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ బాంబు ఎటువైపు నుంచి వస్తుందో తెలియక వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సంక్షోభం మెుదలైనప్పటి నుంచి ఎన్నో హృదయావిధారకర వీడియోలు నెట్టింట వైరల్ (Viral Video) అయ్యాయి. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి నెటిజన్స్ చేత కన్నీరు పెట్టిస్తోంది. ఈ వీడియోలో ఉక్రెయిన్ చిన్నారి పాడిన పాటకు ఎంతోమంది ఫిదా అయ్యారు. 

రష్యా దాడుల నుంచి తప్పించుకోవడానికి ఈ చిన్నారి (Ukrainian Girl), ఆమె కుటుంబం ఓ బాంబు షెల్టర్ లో దాక్కున్నట్లు తెలుస్తోంది. వీళ్లలాగే చాలా మంది అక్కడ బిక్కుబిక్కు మంటూ దాక్కుని ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అప్పుడు ఆ చిన్నారి డిస్నీ యానిమేషన్ చిత్రం 'ఫ్రోజెన్' (Frozen) నుండి "లెట్ ఇట్ గో" పాటను పాడుతోంది. ఆ సాంగ్ అక్కడ ఉన్నవారు అందరినీ కదిలిస్తోంది. 1 నిమిషం 46 సెకండ్ల నిడివి గల ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలను అందుకుంటుంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో 3 మిలియన్ల మందికిపైగా వీక్షించారు.  ఆ వీడియోలో ఉన్న అమ్మాయి పేరు అమేలియాగా తెలిసింది.

Also Read: PM speaks to Putin: 'జెలెన్‌స్కీతో నేరుగా మాట్లాడండి'.. పుతిన్​కు ప్రధాని మోదీ సూచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Facebook , Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News