Baba Vanga Predictions: ఆందోళన కల్గిస్తున్న బాబా వేంగా జోస్యం, ఇండియాలో అలా జరుగుతుందా

Baba Vanga Predictions: రానున్న మూడు నెలలు ఇండియాకు భారంగా మారనున్నాయి. మరి కొద్దిరోజుల్లో కరవు పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. ఇదంతా ఏంటని ఆలోచిస్తున్నారా..బాబా వేంగా భవిష్యవాణి ఇది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 7, 2022, 04:34 PM IST
Baba Vanga Predictions: ఆందోళన కల్గిస్తున్న బాబా వేంగా జోస్యం, ఇండియాలో అలా జరుగుతుందా

Baba Vanga Predictions: జ్యోతిష్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న అంశం. బల్గేరియాకు చెందిన వేంగా బాబా జ్యోతిష్యం చాలా ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా చాలా విషయాలపై బాబా వేంగా జ్యోతిష్యం నిజమైన పరిస్థితి. ఇండియా గురించి కూడా వేంగా బాబా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆందోళన రేపుతున్నాయి. ఏమౌతుందననే ఆసక్తి రేగుతోంది. 

బాబా వేంగా చెప్పిందాని ప్రకారం 2022లో ఇండియాలో కరవు వంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. ‌అది కూడా ఈ ఏడాది జరుగుతుందని బాబా వేంగా చెప్పారు.  అంటే బాబా వేంగా చెప్పింది జరగడానికి మరో మూడు నెలలే మిగిలాయి. ఈ ఏడాది అతడు చెప్పిన విషయాల్లో ఇప్పటికే రెండు నిజమయ్యాయి.

బాబా వేంగా ప్రకారం 2022లో కరవు రాజ్యమేలుతుంది. భవిష్యవాణి ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత పడిపోతుంది. దాని ప్రభావం ఇండియాపై పడనుంది. ఉష్ణోగ్రత పడిపోవడం వల్ల మిడతల ధాటి పెరుగుతుంది. మిడతల దండు ఇండియాలోని పంట పొలాల్ని నాశనం చేస్తుంది. దాంతో దేశంలో కరవు వంటి పరిస్థితులు నెలకొనవచ్చు. 

ద సన్ నివేదిక ప్రకారం బాబా వేంగా 2022లో మొత్తం 6 భవిష్య వాణిలు విన్పించగా అందులో రెండు నిజమయ్యాయి. ఆస్ట్రేలియాతో పాటు కొన్ని ఆసియా దేశాల్లో వరదలు వస్తాయనేది బాబా వేంగా చెప్పిన విషయం. ఆస్ట్రేలియాలో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు పాకిస్తాన్‌లో ఇటీవల వరద ముంచేసింది. ఇంకా చాలా ప్రాంతాల్లో వరదలు అల్లకల్లోలం చేశాయి.

ఆస్ట్రేలియాలో వరద, కొన్ని దేశాల్లో నీటి కొరతే కాకుండా 2022లో సైబీరియాలో ఓ కొత్త ప్రమాదకర వైరస్ వ్యాపించనుందని బాబా వేంగా జోస్యం చెప్పాడు. కరోనా వైరస్ తరువాత ప్రజలకు ఈ కొత్త వైరస్ భయం వెంటాడుతుంది. ఇవి కాకుండా ఏలియన్స్ దాడులు, మిడతల దండు దాడి, వర్చువల్ రియాలిటీలో అభివృద్ధిపై కూడా జోస్యం చెప్పాడు. 

Also read: Guru Margi 2022: దీపావళి తర్వాత ఈ రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News