Chandra Grahan 2022: చంద్రగ్రహణం వేళ ఈ 3 రాశుల వారిని వరించనున్న అదృష్టం.. ఇందులో మీరున్నారా మరి..

Chandra Grahan 2022: ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నాడే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం కొన్ని రాశులవారికి అనుకూలంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2022, 10:58 AM IST
Chandra Grahan 2022: చంద్రగ్రహణం వేళ ఈ 3 రాశుల వారిని వరించనున్న అదృష్టం.. ఇందులో మీరున్నారా మరి..

Chandra Grahan 2022 effect on Zodiacs: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం రేపు అంటే నవంబరు 8న ఏర్పడబోతుంది. ఇది మేషం మరియు భరణి నక్షత్రాలలో ఏర్పడనుంది. ఈ గ్రహణ ప్రభావం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేయనుంది. ఈ గ్రహణం నవంబర్ 8న సాయంత్రం 5.20 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6.20 గంటలకు ముగుస్తుంది. ఇప్పుడు రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclipse 2022) భారతదేశంలోని తూర్పు ప్రాంతాల్లో కనిపించనుంది. అయితే ఈ గ్రహణం కొన్ని రాశులవారికి శుభప్రభావం చూపనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

చంద్రగ్రహణం ఈ రాశులకు లాభం
మిధున రాశి(Gemini): ఈ చంద్రగ్రహణం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆఫీసులో మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీ లాభం ఉంటుంది. మీడియా, బ్యాంకింగ్ లేదా విద్యా రంగంలో పని చేసే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. 
​కర్కాటక రాశి(Cancer): ఈ సంవత్సరం ఏర్పడే చివరి చంద్ర గ్రహణం వల్ల మీకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.  మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
​కుంభ రాశి(Aquarius): గ్రహణ ప్రభావం వల్ల కుంభరాశి వారు అపారమైన ప్రయోజనాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. కొత్తగా బిజినెస్ ప్రారంభించే వారికి ఈసమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక నెరవెరే అవకాశం ఉంది. 

Also Read: Chandra Grahan 2022: చంద్రగ్రహణం రోజు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News