Chandra Grahan 2022: నేడే చంద్రగ్రహణం.. ఈ రోజు ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకోండి..

Lunar Eclipse 2022: ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ సమయంలో పుడ్ తీసుకోవచ్చా లేదా అనే సందేహాలు ఉంటాయి. మీ డౌట్ కు సమాధానం కావాలంటే ఈ స్టోరీ చదివేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2022, 06:15 AM IST
Chandra Grahan 2022: నేడే చంద్రగ్రహణం.. ఈ రోజు ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకోండి..

Chandra Grahan 2022: సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడు. దీనినే బ్లడ్ మూన్ అని అంటారు. ఈ టైంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉంటారు. ఈసారి ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం దేశంలోని అన్ని ప్రాంతాల్లో కనిపించనుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం కార్తిక పౌర్ణమి భరణి నక్షత్రంలో ఇవాళ అంటే నవంబరు 8న చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం మంగళవారం మధ్యాహ్నం 2.40గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  అయితే గ్రహణ సమయంలో ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకుందాం. 

ఏం తినాలి?
గ్రహణ సమయంలో మనం ఆహారం తీసుకుంటే అది సరిగ్గా జీర్ణమవ్వదు. అంతేకాకుండా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మనం ఏది తిన్నా గ్రహణం ముందే తినేయాలి. మీరు ఈ రోజు తక్కువ ఆయిల్ తో ఇంట్లో వండిన పుడ్ నే తీసుకోండి. రోటీ, సబ్జీ, పప్పు వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటే మంచిది. పండ్లు కూడా తినవచ్చు. తులసి, పసుపు వంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న పుడ్ ను ఖచ్చితంగా తీసుకోండి. వీటిని మీరు తినే ప్రతి ఆహారంలో వేసుకోవాలని నిపుణులు చెప్తారు. 

ఏం తినకూడదు?
గ్రహణ సమయంలో ముందు వండిన లేదా నిల్వ ఉన్న ఆహారాన్ని తినకూడదు. ఫ్రెష్ గా వండుకుని తినాలి. అంతేకాకుండా నాన్ వెజ్ వంటకాలైన చికెన్, చేపలు, పంది, మటన్ వంటి మాంసాహారాలను తినడం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గ్రహణ సమయంలో మద్యం, ధూమపానం వంటివి చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి పుడ్ ను తీసుకోండి. 

Also Read: Chandra Grahan 2022: చంద్రగ్రహణం వేళ ఈ 3 రాశుల వారిని వరించనున్న అదృష్టం.. ఇందులో మీరున్నారా మరి..

Also Read: Lunar Eclipse 2022: దేశంలో చంద్రగ్రహణం మెుదటగా ఏ నగరంలో కనిపించనుందో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News