Dhantrayodashi 2021 : సంపదను పెంచే ధనత్రయోదశి పండుగ విశిష్ణత ఇదే

Dhantrayodashi date Puja significance : దీపావళికి (Diwali) ముందు వచ్చే ఈ త్రయోదశిని ‘ధన్‌తేరాస్‌’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘ఛోటీ దివాలీ’ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపదను, శ్రేయస్సును పెంపొందించే త్రయోదశి అని అర్థం. 

Last Updated : Nov 1, 2021, 03:59 PM IST
  • దీపావళికి ముందు వచ్చే త్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత
  • ‘ధన్‌తేరాస్‌’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘ఛోటీ దివాలీ’గా పేరు
  • ధన త్రయోదశి కొత్త వస్తువును కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని నమ్మకం
Dhantrayodashi 2021 : సంపదను పెంచే ధనత్రయోదశి పండుగ విశిష్ణత ఇదే

Dhanteras 2021: Dhantrayodashi date Puja significance and other details here: దీపావళి పండగను ఐదు రోజుల పాటు పర్వదినాలుగా జరుపుకుంటారు. ఈ ఐదురోజుల పర్వదినంలో తొలిరోజున ధన త్రయోదశిని (Dhantrayodashi) నిర్వహించుకుంటారు. దీపావళికి (Diwali) ముందు వచ్చే ఈ త్రయోదశిని ‘ధన్‌తేరాస్‌’ లేదా ‘ధన త్రయోదశి’ లేదా ‘ఛోటీ దివాలీ’ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపదను, శ్రేయస్సును పెంపొందించే త్రయోదశి అని అర్థం. హిందూ సాంప్రదాయాల ప్రకారం కార్తీక మాసం కృష్ణపక్ష త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. నవంబర్ 2వ తేదీన ధనత్రయోదశిని (Dhantrayodashi) నిర్వహించుకోనున్నారు.

ధనత్రయోదశి రోజున ఐశ్వర్య దేవత గా భావించే మహాలక్ష్మీ పాలసముద్ర మథనంలో సముద్రం నుంచి బయటకు ఉద్భవించిందని ప్రతీతి. అందుకే సంపద దేవుడు అయిన కుబేరుడుతో (Kuberadu) పాటు లక్ష్మీదేవిని (Lakshmidevi) ఈ ధనత్రయోదశి రోజున పూజిస్తారు. అందుకే ధన త్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ధనత్రయోదశిన సూర్యాస్తమయం నుంచి లక్ష్మీదేవీకి పూజ చేయటం శ్రేష్ఠమైనది. ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం నుంచి అందులోనూ స్థిరలగ్నంలో లక్ష్మీ పూజ (Lakshmi Puja) చేస్తే అమ్మవారు మన ఇంటికి వచ్చి, స్థిరంగా నివాసం ఉంటారని పెద్దల నమ్మకం.

Also Read : Deepavali Release Movies: దీపావళికి థియేటర్లలో ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే

తెలుగు రాష్ట్రాలలోనూ ధనత్రయోదశిని ఎంతో పవిత్రమైన రోజుగా ఆచరిస్తారు. ఈ రోజున బంగారం (Gold) కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తి కొలది పూజిస్తారు. అలాగే 
యమలోకంలోని పితరులు ఈ పండగకు తిరిగి తమ పూర్వ గృహాలకు వస్తారని పలువురి విశ్వాసం. 

ధన త్రయోదశిన సాయంకాలం తమ ఇళ్ళముందు దక్షిణ దిశగా దీపాలు ఉంచుతారు. అయితే తల్లి,దండ్రులు ఉన్నవారు ఇలా దీపాలను దక్షిణ దిక్కున వెలిగించకూడదు. పరిపూర్ణ ఆయువు కోసం ధనత్రయోదశిన యమధర్మరాజును (Yamadharmaraju) పూజించాలి. ఆ రోజున సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాల్ని వెలిగించాలి. వీటిని యమదీపాలుగా చెప్తారు. ఇలా చేయటం వల్ల యముడు శాంతించి, అకాల మృత్యువును దరిచేరనీయడని పురాణగాధలు చెబుతున్నాయి.

ధనత్రయోదశిన ప్రత్యేకంగా బంగారం, వెండి, వస్త్రాలు, ఆభరణాలు లేదా ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేసి, ఆ సాయంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి (Lakshmidevi) స్వాగతం పలుకుతారు. చాలా మంది తమ తాహతుకు తగినట్లు బంగారం, (Gold) వెండి, కొత్త బట్టలు, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధన త్రయోదశిన (Dhantrayodashi) ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని నమ్ముతారు.

Also Read : Ysr Awards Funtion: విశిష్ట వ్యక్తులకు వైఎస్సార్ అవార్డులు ప్రదానం చేసిన వైఎస్ జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News