Lunar Eclipse 2022: సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు? ఇది మనదేశంలో కనిపిస్తుందా?

Lunar Eclipse 2022: మరో పదిహేను రోజుల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది భారతదేశంలో కనిపిస్తుందా, సూతక్ కాలం ఎప్పుడు, గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2022, 01:44 PM IST
Lunar Eclipse 2022: సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడు? ఇది మనదేశంలో కనిపిస్తుందా?

Lunar Eclipse 2022: ఈ ఏడాది రెండవ మరియు చివరి చంద్రగ్రహణం మరో 15 రోజుల్లో ఏర్పడనుంది. అంటే నవంబరు 8న, కార్తీక మాసం పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణ కాలంలో స్నానానికి, దానానికి విశేష ప్రాధాన్యత ఉంది.  ఇప్పుడు ఏర్పడబోయేది సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclipse ). మనదేశంలో కూడా ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. సుమారు గంటన్నరపాటు దీనిని భారతదేశంలో చూడవచ్చు. ఈ చంద్రగ్రహణం మానవ జీవితంపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపుతుంది. 
భారతదేశంలో గ్రహణ సమయం: సంపూర్ణ చంద్రగ్రహణం నవంబర్‌  8వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 06.19 గంటల వరకు ఉంటుంది.

చంద్రగ్రహణం ఎక్కడ చూడవచ్చు?
భారతదేశంతోపాటు ఉత్తర మరియు దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్ మహాసముద్రం మరియు హిందూ మహాసముద్రంలో చంద్రగ్రహణాన్ని చూడవచ్చు.

సూతక్ కాలం: ఈ చంద్రగ్రహణం యొక్క సూతక కాలం నవంబర్ 08 ఉదయం 09.21 నుండి ప్రారంభమవుతుంది. ఇది సాయంత్రం 06:18 గంటలకు గ్రహణంతో ముగుస్తుంది. 

ప్రభావం ఎలా ఉంటుంది?
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, 15 రోజుల్లోపు రెండు గ్రహణాల కారణంగా, దాని ప్రభావం దేశం మరియు ప్రపంచంపై కూడా ఉంటుంది. వాతావరణంలో ఆకస్మిక మార్పులు ఏర్పడవచ్చు.  

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మత విశ్వాసాల ప్రకారం, గ్రహణం అనేది ఒక అశుభకరమైన సంఘటన. ఇది మన జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. గ్రహణ కాలంలో ఆలయాల తలుపులు మూసి ఉంటాయి. గ్రంథాల ప్రకారం గ్రహణ సమయంలో ఆహారం తినడం నిషిద్ధం. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఇంట్లో గంగాజలం చల్లుకోవాలి.

Also Read: Nagula Chaviti 2022: ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడు, పూజా విధానం, విశిష్టత 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News