Shani Lucky Zodiac: జూన్‌ 29న శని తిరోగమనం.. ఈ రాశులవారు గుడ్‌న్యూస్‌ వింటారు!

Shani Lucky Zodiac Signs: శని తిరోగమనంతో జూన్‌ 29 నుంచి కొన్ని రాశులవారి  విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక పరమైన విషయాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : May 15, 2024, 10:34 AM IST
Shani Lucky Zodiac: జూన్‌ 29న శని తిరోగమనం.. ఈ రాశులవారు గుడ్‌న్యూస్‌ వింటారు!

Shani Lucky Zodiac Signs In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో కీడు గ్రహంగా పరిగణించే శని.. సంచారం, తిరోగమనం చేస్తే అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని గ్రహం జూన్‌ 29 నుంచి కుంభ రాశిలో శని తిరోగమనం మొదలు పెట్టబోతోంది. అలాగే ఇదే సమయంలో చంద్రుడు కూడా కుంభ రాశిలో సంచారం చేయబోతున్నాడు. దీంతో 139 రోజుల పాటు  లాభాలు కలుగుతాయి. అలాగే ఈ గ్రహం వచ్చే సంవత్సరం కుంభ రాశిలో నుంచి మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారి జీవితాల్లో శుభ సమయాలు రాబోతున్నాయి. శని తిరోగమనంతో ఏయే రాశివారి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:
శని తిరోగమనంతో మేష రాశి వారి జీవితాల్లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. దీని కారణంగా వీరికి భౌతిక ఆనందం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో అన్ని ప్రయత్నాల్లో విజయం కలబోతోంది. దీంతో పాటు వృత్తిపరమైన జీవితం గడుతుపుతున్నవారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే వీరు ఎలాంటి ప్రణాళిలతో ముందుకు వెళ్లిన విజయాలు సాధించగలుగుతారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అలాగే వీరు ఎప్పటి నుంచో వినాలనుకున్న శుభవార్తలు కూడా వింటారు. అలాగే స్నేహితుల నుంచి కూడా ఊహించిన లాభాలు కలుగుతాయి. 

వృషభ రాశి:
వృషభ రాశివారికి శని తిరోగమనం కారణంగా వ్యాపారాల్లో అనేక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎదైనా వ్యాపారాలు ప్రారంభిస్తే విజయాలు కూడా సులభంగా సాధిస్తారు. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు త్వరలోనే శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారు అకస్మాత్తుగా లాభాలు కూడా పొందుతారు. అలాగే వీరికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంతుకాకుండా కొత్త ప్రాజెక్ట్‌లో డబ్బులు సంపాదించే ఛాన్స్‌ కూడా ఉంది. 

మకరరాశి:
మకర రాశివారు ఈ శని తిరోగమనం కారణంగా మంచి శుభవార్తలు వింటారు. ముఖ్యంగా కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లిన విజయాలు సాధిస్తారు. అలాగే గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వస్తాయి. దీంతో పాటు వీరికి డబ్బు విపరీతంగా వస్తుంది. కానీ వీరు ఈ సమయంలో వ్యాపారాలు చేయడం మానుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ వీరి సంపద విపరీతంగా పెరగుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

మీనరాశి:
మీన రాశివారికి శని తిరోగమనం కారణంగా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో జీవితాని సంబంధించి విషయాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ప్రేమ సంబంధాల్లో మాధుర్యం కూడా రెట్టింపు అవుతుంది. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే ఇప్పటికే భాగస్వామ్య జీవితం గడుపుతున్నవారికి మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్నవారికి కూడా ఈ సమయంలో చాలా ఆఫర్లు వస్తాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News