Ugadi 2023: ఉగాది పూట ఈ రాశులవారి జీవితాల్లో రాహువు- కేతువు మహర్దశ.. పరిణామాలు & నివారణ చర్యలు

Ugadi 2023 Date: రాహు-కేతు దోషం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే పండగ పూట బలపడితే ఈ చర్యలు తీసుకోవాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2023, 12:52 PM IST
Ugadi 2023: ఉగాది పూట ఈ రాశులవారి జీవితాల్లో రాహువు- కేతువు మహర్దశ.. పరిణామాలు & నివారణ చర్యలు

Rahu-Ketu Mahardasa Dosha effects on Ugadi 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి వ్యక్తి జాతకంలో కొన్ని గ్రహాలు బలంగా ఉంటే మరికొన్ని బలహీనంగా ఉంటాయి. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక గ్రహం మహాదశ లేదా అంతర్దశలో ఉంటుంది. ఇలాంటి దశలే వ్యక్తుల జీవితాల్లో భారీ మార్పులు చేర్పులు చేకూర్చుతుంది. అంతేకాకుండా రాహు-కేతువులు ప్రభావం కూడా పడుతుంది. దీని కారణంగా జీవితంలో తీవ్ర మార్పలు సంభవించే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాహువు మహర్దశ వల్ల తీవ్ర నష్టాలు సంభవించిన..జాతకంలో రాహువు శుభంగా ఉన్నప్పుడు వారి జీవితంలో మార్పులు వస్తాయి. దీని కారణంగా సమాజంలో గౌరవం పెరిగి చాలా రకాల ఆర్థిక లాభాలు పొందుతారు. అశుభకరమైన రాహువు దశ వల్ల మనిషి జీవితంలో దుష్ప్రభావాలు కలుగుతాయి. రాహువు మహర్దశ ప్రభావాలు, ఫలితాల గురించి తెలుసుకుందాం..

రాహువు యొక్క మహర్దశ ప్రభావాలు:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో రాహువు శుభంగా ఉన్నప్పుడు, వ్యక్తి వ్యక్తిత్వంలో ఆకర్షణీయమైనంగా కనిపిస్తారు. అంతేకాకుండా వారికి సమాజంలో ప్రభావవంతమైన స్థానం లభిస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి పనులు, వ్యాపారాలు చేసిన విపరీతమైన లాభాలు పొందుతారు.  రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటారు. అయితే జాతకంలో రాహువు అశుభంగా ఉన్నప్పుడు..వ్యక్తులు చాలా రకాల నష్టాలకు గురవుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారు. దీని కారణంగా మానసిక అస్థిరత, పేగు సమస్యలు, అల్సర్, గ్యాస్ట్రిక్ తదితర సమస్యల బారిన పడతారు. కాబట్టి ఇలాంటి దుష్ప్రభావాలకు గురయ్యే వారు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..జాతకంలో రాహువు స్థానం బలంగా ఉన్నప్పుడు పదునైన తెలివితేటలను పొందుతాడు. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.

రాహువు అననుకూల ప్రభావాలను నివారించడానికి చర్యలు:

  1. రాహుదోషం ఉంటే శివుడితో పాటు విష్ణువును పూజించడం వల్ల విశేష ప్రయోజనాలను పొందుతారు.
  2. ప్రతి బుధవారం నల్ల రంగు కుక్కకు తీపి రొట్టె తినిపించడం వల్ల రాహు దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.  
  3. ఈ దోషంతో బాధపడేవారు తప్పకుండా నీటిలో నల్ల నువ్వులు వేసి స్నానం చేయాల్సి ఉంటుంది.
  4. రాహు గ్రహం సంబంధించిన ఈ " ఓం రా రాహవే నమః " మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించండి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Delhi liq​uor Scam Case: ముగిసిన కవిత విచారణ, ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ

Also Read: Brave Lady Traps Black Cobra: కాటు వేయటానికి వచ్చిన కింగ్ కోబ్రాను ఈజీగా కంట్రోల్ చేసిన అమ్మాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News