Vaikuntha Darshan Details: టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో జై శ్యామల రావు మాట్లాడుతూ.. సాధారణ యాత్రకుల కోసం వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం టిటిడి కి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అని ఆయన తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో శ్యామల రావు మాట్లాడుతూ.. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి , వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సమగ్ర ప్రణాళికలను ఆయన వివరించారు.
దాదాపు 7 లక్షల మంది భక్తులకు సదుపాయం కల్పించడానికి టీటీడీ విస్తృత ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సురక్షితమైన దర్శన అనుభూతిని కలిగించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జనవరి 15 ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనంతో దర్శనాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఉదయం ఎనిమిది గంటలకు సర్వదర్శనం ఉంటుంది.
అలాగే ఏకాదశి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయ నాలుగు మూడు వీధుల్లో స్వర్ణ రథంపై భక్తులను అనుగ్రహించే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని భక్తులు దర్శించుకుంటారు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వాహన మండపంలో స్వామివారి దర్శనం కల్పిస్తారు.
వైకుంఠ ద్వాదశి రోజు ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు విశేష చక్రస్నానం నిర్వహిస్తారు. ఇకపోతే భారీ సంఖ్యలో యాత్రికులను నిర్వహించడానికి జనవరి 9 నుంచి తిరుపతిలో 8 కేంద్రాలు, నాలుగు కౌంటర్లలో.. 90 కౌంటర్లలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ లనుకూడా జారీ చేయనున్నారు. అలాగే తిరుమలలో పరిమిత వసతి ఉన్నందు కారణంగా దర్శనం టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు మాత్రమే వారి నిర్ణీత సమయాలలో క్యూలలోకి అనుమతిస్తారు.
ముఖ్యంగా రద్దీని నివారించడానికి టీటీడీ ఎంబీసీ, ఔటర్ రింగ్ రోడ్డు ఆర్.బి జిహెచ్ ఏరియాతో సహా వివిధ ప్రదేశాలలో సుమారు 12000 వాహనాలకు..పార్కింగ్ ఏర్పాటును కూడా చేసింది. ఇక మైసూర్ దసరా నిపుణుల ద్వారా అన్నప్రసాదం, అదనపు పారిశుద్ధ్యం, పూల అలంకరణలు అలాగే విద్యుత్ ప్రకాశం వంటి సేవలను కూడా టీటీడీ మెరుగుపరుస్తోంది.
దాదాపు పది రోజులపాటు 3000 మందికిపైగా.. శ్రీవారి సేవకులు స్కౌట్స్, గైడ్స్ యాత్రికులకు సహాయం చేస్తారు. భద్రత కోసం తిరుపతి అలాగే తిరుమల అంతట సుమారు 3000 మంది పోలీసులను కూడా మోహరిస్తారు. కార్యకలాపాలు సజావుగా సాగడానికి..ముఖ్యంగా దర్శన కేంద్రాల వద్ద సవ్యంగా పరిస్థితులు సాగడానికి పోలీసులు సహాయపడతారు అని తెలిపారు.
Also Read: Ys Jagan Schedule: ఈ నెలాఖరు నుంచి జిల్లాల పర్యటన జగన్ షెడ్యూల్ ఫిక్స్ ఎలా ఉంటుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.