నాలుగోసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు !

నాలుగోసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు !

Last Updated : Nov 25, 2018, 12:19 PM IST
నాలుగోసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు !

ఆంటిగ్వా: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో నాలుగోసారి విజేతగా నిలిచి ఆస్ట్రేలియా మహిళల జట్టు రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. బ్యాట్స్‌ఉమెన్, బౌలర్ల సమిష్టి కృషి చేయడంతో ఆస్ట్రేలియా విజయానికి బాటలు వేసినట్టయింది. 106 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్ల నష్టానికే 15.1 ఓవర్లలోనే ఛేదించి శభాష్ అనిపించుకుంది ఆస్ట్రేలియా జట్టు. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌ విషయానికొస్తే, ఇంగ్లండ్ బౌలర్ అన్య శ్రబ్‌సోల్ విసిరిన మొదటి ఓవర్‌లోనే ఆసిస్ ఓపెనర్ అలిస్సా హీలీ 14 పరుగులు రాబట్టి శుభారంభానిచ్చింది. వరుసగా బౌండరీలు బాదుతూ 20 బంతుల్లోనే 22 పరుగులు పూర్తిచేయడంతో ఆసిస్ జట్టు విజయానికి నాంది పలికినట్టయింది.

అంతకన్నా ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆస్ట్రేలియా బౌలర్ల ప్రతాపం ముందు ఇంగ్లండ్ జట్టు ధీటుగా ఆడలేకపోయింది. ఇన్నింగ్స్ మొత్తంలోనూ ఏ దశలోనూ ఆసిస్ బౌలర్లకు గట్టి పోటినివ్వలేకపోయిన ఇంగ్లండ్ బ్యాట్స్‌ఉమెన్ తక్కువ స్కోర్‌కే ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. డానీ వ్యాట్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా కెప్టెన్ హీథర్ నైట్ కూడా రెండంకెల స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డ్‌నర్ 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకుంది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లకు మరో 2 బంతులు మిగిలివుండగానే ఇంగ్లండ్ 105 పరుగులకే ఆలౌటైంది. గార్డ్‌నర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, హీలీకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డులు దక్కాయి.

Trending News