ICC T20 WC 2022: అతడు లేకపోతే టీమిండియాకు కష్టమే..ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ICC T20 WC 2022: త్వరలో టీ20 వరల్డ్ కప్‌ ప్రారంభంకానుంది. టోర్నీకి ముందే టీమిండియా వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Written by - Alla Swamy | Last Updated : Oct 2, 2022, 03:23 PM IST
  • త్వరలో టీ20 వరల్డ్ కప్‌ ప్రారంభం
  • టోర్నీకి ముందే టీమిండియా వరుసగా షాక్‌లు
  • ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ICC T20 WC 2022: అతడు లేకపోతే టీమిండియాకు కష్టమే..ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ICC T20 WC 2022: ప్రస్తుతం స్వదేశంలో భారత క్రికెట్ జట్టు..దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ ఆడుతోంది. దీని తర్వాత మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌ కోసం భారత జట్టు..ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఈనేపథ్యంలో టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్ జడేజా దూరమయ్యాడు. బుమ్రా సైతం గాయపడ్డారు. ఐతే అతడు వరల్డ్ కప్ ఆడతాడా..లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

ఈనేపథ్యంలో భారత పేసర్ బుమ్రాపై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు జట్టుకు దూరమైతే టోర్నీలో భారత జట్టు గెలవడం కష్టమేనన్నాడు. తన అటాకింగ్‌తో ఎలాంటి ఆటగాడినైనా బోల్తా కొట్టించగలడని తెలిపాడు. బుమ్రా వద్ద అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలు ఉన్నాయని చెప్పాడు. అతడు ఇండియాలో కాదు..ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ అని కొనియాడాడు. 

ఒకవేళ జట్టుకు బుమ్రా దూరమైతే టీమిండియాకు తీరని లోటు అని షేన్ వాట్సన్ అన్నాడు. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని స్పష్టం చేశాడు. ఈమేరకు ఓ టీవీ ఛానల్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ప్రస్తుతం భారత జట్టు..స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఐతే తొలి మ్యాచ్‌లో బుమ్రా ఆడలేదు.

వెన్నునొప్పి తిరగబెట్టడంతో మ్యాచ్‌కు దూరమైయ్యాడు. ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. అతడి స్థానంలో యువ పేసర్ సిరాజ్‌ను ఎంపిక చేశారు. ప్రపంచకప్‌నకు సైతం అతడు దూరమవుతాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై బీసీసీఐ చీఫ్‌ గంగూలీ, జట్టు హెచ్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ కప్‌నకు బుమ్రా పూర్తిగా తప్పుకోలేదని స్పష్టం చేశారు. 

అతడి రాక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఐతే ప్రపంచ కప్‌నకు బుమ్రా బదులుగా సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారులు ఎలాంటి ప్రకటన చేయడం లేదు. 

Also read:ICC T20 WC 2022: గెలుపు నీదా..నాదా..భారత్-పాక్ మ్యాచ్‌పై స్పెషల్ ప్రోమో అదుర్స్..!

Also read:Indonesia Soccer Tragedy: ఇండోనేషియా స్టేడియంలో తొక్కిసలాట..174కి చేరిన మృతుల సంఖ్య..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News