Axar Patel Marriage: ప్రియురాలిని పెళ్లాడిన టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌.. ఫొటోలు వైరల్‌!

India Cricketer Axar Patel tied the knot with girlfriend Meha Patel. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి మెహా పటేల్‌ను అక్షర్‌ గురువారం పెళ్లి చేసుకున్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 27, 2023, 01:22 PM IST
  • ప్రియురాలిని పెళ్లాడిన అక్షర్‌ పటేల్‌
  • అక్షర్‌ పటేల్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌
  • 31 బంతుల్లో 65 పరుగులు
Axar Patel Marriage: ప్రియురాలిని పెళ్లాడిన టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌.. ఫొటోలు వైరల్‌!

India Cricketer Axar Patel Marries Long Time Girlfriend Meha Patel: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి మెహా పటేల్‌ను అక్షర్‌ గురువారం పెళ్లి చేసుకున్నాడు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య అక్షర్‌ పెళ్లి వడోదరలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి పలువురు క్రికెటర్లు, ప్రముఖులు హాజరయ్యారు. అక్షర్‌ పటేల్‌ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫాన్స్ అక్షర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చిన్ననాటి స్నేహితురాలు మెహా పటేల్‌తో అక్షర్‌ పటేల్‌ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. గతేడాది తన పుట్టిన రోజున మెహా వేలికి ఉంగరం తొడిగి.. అక్షర్‌ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సంవత్సరం తర్వాత మెహాను పెళ్లాడిన అక్షర్.. వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. అక్షర్‌ క్రికెటర్ కాగా.. మెహా న్యూట్రిషనిస్ట్‌, డైటీషియన్‌గా పని చేస్తున్నారు. అక్షర్‌ పెళ్లికి క్రికెటర్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ తన సతీమణితో కలిసి హాజరయ్యాడు.

పెళ్లి కారణంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు అక్షర్‌ పటేల్ దూరమయ్యాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టులోకి వచ్చిన వచ్చిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్.. సత్తా చాటుతున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ల్లో అదరగొట్టాడు. లంకతో జరిగిన రెండో టీ20లో 31 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ అక్షర్ కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకమే.

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సోమవారం (జనవరి 23) బాలీవుడ్‌ నటి అతియా శెట్టిని పెళ్లాడాడు. గురువారం (జనవరి 26) అక్షర్‌ పటేల్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి క్రికెటర్‌లకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: Budget Tata Nexon Cars: కేవలం 6 లక్షలకే టాటా నెక్సాన్‌ కారు.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!

Also Read: Ford Bronco Bookings: ఈ కార్ బుకింగ్‌ను రద్దు చేసుకుంటే.. రూ. 2 లక్షలు మీ సొంతం! లిమిటెడ్ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News