Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన అజిత్ అగార్కర్, షేన్ వాట్సన్

Ajit Agarkar and Shane Watson: ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు అజిత్ అగార్కర్, షేన్ వాట్సాన్ జట్టు నుంచి దూరమైనట్లు వెల్లడించింది. చీఫ్ సెలక్టర్ పదవికి పోటీ పడుతున్న అగార్కర్.. అంతకుముందే ఢిల్లీ జట్టు నుంచి వైదొలిగాడు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 30, 2023, 07:05 AM IST
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన అజిత్ అగార్కర్, షేన్ వాట్సన్

Ajit Agarkar and Shane Watson: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇద్దరు సహాయ కోచ్‌లు అజిత్ అగార్కర్, షేన్ వాట్సాన్‌ కాంట్రాక్ట్స్‌ను రద్దు చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు ప్రదర్శన దారుణంగా ఉండడంతో కోచ్ రికీ పాంటింగ్‌ను మారుస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే అసిస్టెంట్‌ కోచ్‌లు తప్పుకున్నారు. చీఫ్ సెలక్టర్ పదవి రేసులో ఉండడంతో అజిత్ అగార్కర్ సహాయ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అగార్కర్‌తోపాటు షేన్ వాట్సన్ కూడా జట్టు నుంచి విడిపోతున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ చేసింది. మీరు ఇప్పుడు రావాలని కోరుకున్నా.. ఇక్కడ మీ కోసం ప్లేస్ ఉంటుందని రాసుకొచ్చింది.  

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి రేసులో ముందు వరుసలో ఉండడంతోనే ఢిల్లీ జట్టు బాధ్యతలను అగార్కర్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అగార్కర్ పేరును బీసీసీఐ ఫైనల్ చేసినట్లు సమాచారం. గతంలోనే సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌ పదవికి రెండుసార్లు అజిత్ అగార్కర్ పేరు వినిపించినా.. సుముఖత చూపించలేదు. ఈసారి చీఫ్ సెలక్టర్ పదవిపై అగార్కర్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్‌ కోచ్ పదవి నుంచి తప్పుకున్న తరువాత ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.  

 

జీ న్యూస్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో గత సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. బీసీసీఐ, టీమిండియాకు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేశాడు. ఈ విషయంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేయడంతో చేతన్ శర్మ చీఫ్‌ సెలక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత సెలక్షన్ కమిటీలోని సభ్యుడైన శివ్‌సుందర్‌ దాస్‌ను తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించింది. అన్ని కుదిరితే.. వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోనే టీమిండియా జట్టు ఎంపిక ఉండనుంది. 

ఫాస్ట్ బౌలర్‌గా అజిత్ అగార్కర్ టీమిండియాకు ఎన్నో ఏళ్లు సేవలు అందించాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో కీ రోల్ ప్లే చేశాడు. అగార్కర్ వన్డేల్లో 288 వికెట్లు తీయగా.. టెస్ట్‌లో 58 వికెట్లు తీశాడు. టీ20ల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. 2007లో టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాలో అగార్కర్ సభ్యుడిగా ఉన్నాడు. 

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే.. సీజన్‌కు ముందే ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా దూరమయ్యాడు. దీంతో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో బరిలోకి దిగింది. గ్రూప్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం ఐదు విజయాలు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో కింద నుంచి రెండోస్థానంతో ముగించింది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఢిల్లీ జట్టును ముంచింది. 

Also Read: Ambati Rayudu News: రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు కీలక ప్రకటన  

Also Read: Minister Senthil Balaji: తమిళనాడు గవర్నర్ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం నుంచి సెంథిల్‌ బాలాజీ తొలగింపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News