Joe Root: కాళ్ల మధ్యలో దూరిన బంతి.. విచిత్ర రీతిలో జోరూట్ క్లీన్‌బౌల్డ్

Eng Vs Ned World Cup 2023: ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ విచిత్రంగా ఔట్ అయ్యాడు. రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించగా.. బాల్ కాళ్ల సందులో దూరిపోయి వికెట్లను పడగొట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 8, 2023, 07:01 PM IST
Joe Root: కాళ్ల మధ్యలో దూరిన బంతి.. విచిత్ర రీతిలో జోరూట్ క్లీన్‌బౌల్డ్

Eng Vs Ned World Cup 2023: వరల్డ్ కప్‌ రేసు నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్.. పరువు కోసం ప్రయత్నిస్తోంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి వరల్డ్ పాయింట్ల పట్టికలో టాప్-8లో నిలవాలని చూస్తోంది. ఇందులో భాగంగా నేడు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. బెన్ స్టోక్స్ (108) సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ మలాన్ (87), క్రిస్ వోక్స్ (51) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో జోరూట్ విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. రివర్స్ స్కూప్ షాట్‌ ఆడే క్రమంలో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 

జో రూట్ రివర్స్ స్కూప్ షాట్ ఆడటంలో దిట్ట. ఇప్పటికే అనేక మ్యాచ్‌లలో సక్సెస్‌ ఫుల్‌గా రివర్స్ స్వీప్ షాట్ ద్వారా పరుగులు రాబట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో రివర్స్ స్వీప్‌ షాట్‌కు ప్రయత్నించి విఫలమయ్యాడు. అప్పటికే రూట్, డేవిడ్ మలన్ రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించి క్రీజ్‌లో కుదురుకున్నారు. 28 పరుగులు చేసిన రూట్.. మంచి లయలో భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో నెదర్లాండ్స్ ఫాస్ట్ బౌలర్ లోగాన్ వాన్ బీక్‌ బౌలింగ్‌కు వచ్చాడు. 

థర్డ్ మ్యాన్‌పై స్కూప్ చేయాలనుకోగా.. లెంగ్త్ డెలివరీని మిస్ చేయడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి ఊహించినంతగా బౌన్స్ కాకపోవడంతో నేరుగా వికెట్లను తాకింది. బంతి అతని కాళ్లలోంచి స్టంప్‌లపైకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జో రూట్‌ ఔట్‌పై క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

ఇప్పటికే వరల్డ్ కప్‌లో వరుస ఓటములతో డీలా పడిపోయిన ఇంగ్లాండ్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. డేవిడ్ మలాన్ (74 బంతుల్లో 87, 10 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ స్టోక్స్ (84 బంతుల్లో 108, 6 ఫోర్లు, 6 సిక్సర్లు), క్రిస్ వోక్స్ (45 బంతుల్లో 51, 5 ఫోర్లు, ఒక సిక్స్)తో ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లీడీ 3, ఆర్యన్ దత్, లోగాన్ వాన్ బీక్ చెరో రెండు వికెట్లు, మీకెరెన్ ఒక వికెట్ పడగొట్టారు.

Also Read: World Cup 2023 Semifinal Teams: పాక్ వర్సెస్ ఆఫ్ఘన్ వర్సెస్ కివీస్ 4వ సెమీస్ ఎవరిది

Also Read: NBK109: గొడ్డలికి కళ్ళజోడు.. మన బాలయ్య కు మరో బ్లాక్ బస్టర్ షురూ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News