రాజస్థాన్ రాయల్స్‌లో స్మిత్ స్థానం హెన్రిచ్‌తో భర్తీ

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు గతంలో స్టీవ్ స్మిత్‌‌ను తమ టీమ్‌లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

Last Updated : Apr 2, 2018, 05:31 PM IST
రాజస్థాన్ రాయల్స్‌లో స్మిత్ స్థానం హెన్రిచ్‌తో భర్తీ

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు గతంలో స్టీవ్ స్మిత్‌‌ను తమ టీమ్‌లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకోవడంతో ఆయన స్థానాన్ని హెన్రిచ్‌ క్లాసెన్‌తో భర్తీ చేస్తుంది జట్టు. అలాగే కెప్టెన్సీ బాధ్యతలను అజింక్య రహానెకు అప్పగించింది. మొన్నటి వరకు ఇదే అంశంపై తర్జనభర్జనలు పడిన జట్టుకు.. నిషేధానికి గురైన ఆటగాడి స్థానంలో మరో క్రీడాకారుడిని తీసుకొనే అవకాశాన్ని కల్పించింది ఐపీఎల్ చట్ట విభాగం.

ఈ క్రమంలో రూ.50 లక్షలు చెల్లించి స్మిత్ స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ను జట్టులోకి తీసుకుంది రాజస్థాన్ రాయల్స్. హెన్రిచ్‌ క్లాసెన్‌ ఫిబ్రవరి 2018లో తొలిసారిగా వన్డే కెరీర్‌లోకి అడుగుపెట్టాడు. భారత్ పై తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. తను ఆడిన రెండవ వన్డే మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు. ఇక టీ20 మ్యాచ్‌ల విషయానికి వస్తే క్లాసెన్ తన కెరీర్‌లో 49 టీ20లు ఆడి.. 1043 పరుగులు చేశాడు. ఆయనను దక్షిణాఫ్రికాలో చాలామంది ఎంఎస్ ధోనితో పోల్చుతుంటారు.

Trending News