KL Rahul Angry: విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తే... నేను ఖాళీగా కూర్చోవాలా! కేఎల్‌ రాహుల్‌ ఫైర్

KL Rahul reacts to question on Virat Kohli opening the innings in T20Is. ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతున్న వైస్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌కు ఒక రిపోర్టర్‌ అడిన ప్రశ్న కాస్త చికాకు తెప్పించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 9, 2022, 02:00 PM IST
  • విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తే
  • నేను ఖాళీగా కూర్చోవాలా
  • కేఎల్‌ రాహుల్‌ ఫైర్
KL Rahul Angry: విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తే... నేను ఖాళీగా కూర్చోవాలా! కేఎల్‌ రాహుల్‌ ఫైర్

KL Rahul irritated by Reporter question on Virat Kohli in IND vs AFG PressConference: ఆసియా కప్‌ 2022లో భాగంగా గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారత్ భారీ విజయం సాధించింది. కింగ్ విరాట్‌ కోహ్లీ (122 నాటౌట్‌; 61 బంతుల్లో 12×4, 6×6) సెంచరీకి తోడు సీనియర్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్ (5/4) బౌలింగ్‌లో మెరవడంతో భారత్ 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో పాత కోహ్లీని గుర్తు చేస్తూ విరాట్ పరుగులు చేశాడు. 200 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగిన విరాట్ పాత ఫామ్‌ను అందుకున్నాడు. కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన కింగ్.. మైదానం నలు మూలలా షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. 

అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విశ్రాంతి తీసుకోగా.. వైస్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ జట్టు పగ్గాలను అందుకున్నాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం రాహుల్‌ ప్రెస్‌ మీట్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్‌ అడిన ప్రశ్న రాహుల్‌కు కాస్త చికాకు తెప్పించింది. 'అఫ్గానిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా ఎలా ఆడాడో చూశాం. ఐపీఎల్ టోర్నీలో కూడా బాగా రాణించాడు. ముందు ప్రపంచకప్‌ టోర్నీ ఉంది. టీ20ల్లో కోహ్లీని రెగ్యులర్‌ ఓపెనర్‌గా చూడొచ్చా' అని ఓ రిపోర్టర్ అడగ్గా.. 'అయితే ఏంటీ. కోహ్లీ ఓపెనర్‌గా వస్తే నేను ఖాళీగా డగౌట్‌లో కూర్చోవాలా?' అని అన్నాడు. 

అనంతరం కేఎల్ రాహుల్‌ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం టీమిండియాకు శుభపరిణామం. ఈ మ్యాచ్‌లో విరాట్ బాగా ఆడాడు. ఈరోజు మ్యాచ్‌ నిస్సందేహంగా కోహ్లీదే. అతడు ఆడిన తీరుతో చాలా సంతోషిస్తున్నాడని నాకు తెలుసు. మూడో స్థానంలోనూ అతడు సెంచరీలు సాధించగలడు. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో జట్టు మీద ఒత్తిడి పెరిగింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. దాంతో కెప్టెన్‌గా నాపై బాధ్యత పెరిగింది. మంచి స్కోరు చేయాలనుకున్నా. విరాట్ నాపై ఒత్తిడి తగ్గించాడు' అని తెలియపాడు. 

Also Read: Match Fixed: టీమిండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు.. ఐపీఎల్ కోసం మరీ ఇంత కక్కుర్తా!

Also Read: Video: పార్క్‌లో ఆడుకుంటున్న బాలుడిపై 'పిట్‌బుల్' దాడి.. ముఖానికి 200 కుట్లు...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News