ఇండియా vs విండీస్ 3వ వన్డే: 43 పరుగుల తేడాతో గెలుపొందిన విండీస్.. కోహ్లీ సెంచరీ వృథా!

Last Updated : Oct 28, 2018, 02:27 PM IST
ఇండియా vs విండీస్ 3వ వన్డే: 43 పరుగుల తేడాతో గెలుపొందిన విండీస్.. కోహ్లీ సెంచరీ వృథా!

భారత్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా నేడు పూణెలో 3వ వన్డే ఆడిన విండీస్ జట్టు, ఆతిథ్య జట్టుపై 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం 284 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే వరుస వికెట్లు కోల్పోవడంతో కెప్టేన్ విరాట్ కోహ్లీ మిడిల్, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లతో కలిసి ఒంటరి పోరాటం చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే కోహ్లీ వన్డే కెరీర్ లో 38వ సెంచరీని పూర్తి చేశాడు. 

అయితే, విండీస్ బౌలర్ల దూకుడు ముందు టీమిండియా బ్యాట్స్ మేన్ నిలవలేకపోవడంతో టీమిండియా జట్టు విజయానికి బహుదూరంలోనే ఓటమిపాలుకావాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన విండీస్ జట్టు 5 మ్యాచ్‌ల వన్డే సిరిస్‌ను 1-1తో సమం చేసింది.

Trending News