Ind vs Aus: కంగారూల గడ్డపై బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఐదవ టెస్ట్ తొలి రెండ్రోజుల ఆటకే మూడో ఇన్నింగ్స్ నడుస్తోంది. ఐదు రోజులు పూర్తి కాకుండానే టెస్ట్ ముగిసే పరిస్థితి కన్పిస్తోంది. ఒక్క రెండో రోజే 15 వికెట్లు పడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఆసీస్ గడ్డపై జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో దాదాపు ప్రతి టెస్ట్‌లో బౌలర్లదే ఆధిపత్యం కన్పిస్తోంది. చివరి ఐదవ టెస్ట్‌లో తొలి రోజే ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 185 పరుగులకు ఆల్ అవుట్ కాగా రెండో రోజు ఆస్ట్రేలియా 181 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఒక్క రెండో రోజే మొత్తం 15 వికెట్లు పడిపోయాయి. ఇక రిషభ్ పంత్ అయితే టీ20లో ఆడినట్టు ఆడాడు. కేవలం 33 బంతుల్లో 61 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఇంకా మూడు రోజుల ఆట మిగిలింది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు టెస్ట్‌లలో ఆస్ట్రేలియా రెండింట్లో విజయం సాధించగా ఇండియా ఒక టెస్ట్ గెలిచింది. మరో టెస్ట్ డ్రాగా ముగియడంతో టెస్ట్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంతో ఆసీస్ నిలిచింది. చివరి ఐదవ టెస్ట్‌లో టీమ్ ఇండియా విజయం సాధిస్తేనే టెస్ట్ సిరీస్ డ్రా అవుతుంది. లేదంటే ఆసీస్ కైవసం అవుతుంది. అందుకే మూడో రోజంతా టీమ్ ఇండియా వికెట్లు కోల్పోకుండా ఆడితే ఆస్ట్రేలియా ముందు భారీ ఆధిక్యం ఉంచవచ్చు. టెస్ట్ విజయానికి ప్రయత్నించవచ్చు.
తొలిసారి ఆస్ట్రేలియా పర్యటకు వెళ్లిన యశస్వి జైశ్వాల్ ఇండియా తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం 391 పరుగులు చేశాడు. ఇక టీమ్ ఇండియా బౌలర్ జస్‌ప్రీత్ బూమ్రా 47 ఏళ్ల రికార్డు బద్దలుగొట్టాడు. ఒకే సిరీస్‌లో ఎక్కువ వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు.
Also read: Hmpv Virus Precautions: హెచ్ఎంపీవీ చైనా కొత్త వైరస్ నుంచి ఎలా కాపాడుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.