కామన్‌వెల్త్‌ క్రీడల్లో ఇంగ్లండ్‌కి షాకిచ్చిన పురుషుల హాకీ జట్టు

కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్ విజయ దుందుభి మోగిస్తోంది. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు చివరి నిమిషంలో ఇంగ్లండ్‌‌కి షాకిచ్చి అద్భుతమైన విజయం సాధించింది. ఇంగ్లండ్ పై 4:3 తేడాతో గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. అనూహ్యంగా చివరి రెండు నిమిషాల్లో భారత జట్టు చేసిన రెండు గోల్స్ జట్టుని విజయతీరాలకు చేర్చాయి. మొదట్లో భారత్‌పై ఇంగ్లండ్ జట్టు ఆధిపత్యం కనబర్చినప్పటికీ.. ఆ తర్వాత భారత్ తేరుకుని మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో ఇరు జట్లు సమంగా నిలిచాయి. అనంతరం చివరి నిమిషాల్లో భారత్‌పై ఇంగ్లండ్‌పై చేయి సాధించింది. 

ఇక భారత్ గెలవడం కష్టమేనని భావిస్తున్న తరుణంలో అనుకోని విధంగా భారత జట్టు ఇంగ్లండ్‌కు గట్టి షాకిచ్చింది. చివరి రెండు నిమిషాల్లో రెండు గోల్స్ చేసి ఇంగ్లండ్‌ని ఓడించడమే కాకుండా సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు అర్హత సైతం సాధించింది. 

English Title: 
Indian Hockey team beats England to enter semi-finals against New Zealand
News Source: 
Home Title: 

ఇంగ్లండ్‌కి షాకిచ్చిన భారత హాకీ జట్టు

కామన్‌వెల్త్‌ క్రీడల్లో ఇంగ్లండ్‌కి షాకిచ్చిన పురుషుల హాకీ జట్టు
Caption: 
Twitter
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
కామన్‌వెల్త్‌ క్రీడల్లో ఇంగ్లండ్‌కి షాకిచ్చిన పురుషుల హాకీ జట్టు