ఐపీఎల్ 2018: ఢిల్లీపై 13పరుగుల తేడాతో చెన్నై గెలుపు

పూణెలోని క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓడిపోయింది.

Last Updated : May 1, 2018, 01:31 PM IST
ఐపీఎల్ 2018: ఢిల్లీపై 13పరుగుల తేడాతో చెన్నై గెలుపు

పూణెలోని క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓడిపోయింది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ ప్రారంభించింది. బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో బ్యాట్స్‌మెన్లు వాట్సన్ (78), డూప్లెసిస్ (33), రాయుడు (41), ధోని (51) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించి 211/4 స్కోరు నమోదవ్వడంలో తోడ్పడ్డారు. లక్ష్య చేధనలో ఢిల్లీ ఓపెనర్లు నిరాశపర్చగా.. పంత్ (78), విజ‌య్ శంక‌ర్ (54*) శ్రమించారు. అయితే చెన్నై బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా కట్టడి చేయడంతో పరుగులు చేయడం ఢిల్లీ బ్యాట్స్‌మెన్లకు కష్టంగా మారింది. ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 198 ప‌రుగులు చేసింది.  దీంతో 13 ప‌రుగుల తేడాతో ఢిల్లీపై చెన్నై విజ‌యం సాధించింది.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని 22 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌ల‌తో 51 ప‌రుగులతో వేగవంతమైన అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ధోని, రాయుడు కలిసి బౌలర్లను చితక్కొట్టారు. వీరి ధాటికి చివరి 5 ఓవర్లలో చెన్నై 74 పరుగులు రాబట్టడం విశేషం. మిశ్రా బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో దూకుడు మొదలు పెట్టిన ధోని... బౌల్ట్‌ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టాడు. అదే ఓవర్లో రాయుడు కూడా ఫోర్‌ బాదడంతో మొత్తం 21 పరుగులు లభించాయి. ప్లంకెట్‌ వేసిన మరుసటి ఓవర్లో కూడా చెలరేగిన రాయుడు 3 ఫోర్లు కొట్టాడు. రాయుడు, ధోని జోడి 36 బంతుల్లోనే 79 పరుగులు జత చేసింది.

Trending News