ఈ ఏడాది ఐపీఎల్‌లో గెలిచే జట్టు ఇదేనట..!

ఈ ఏడాది ఐపీఎల్-2018 విజేత ఎవరు? ఇంకా మ్యాచ్‌లే ప్రారంభం కాలేదు.. అప్పడే విజేత ఎవరో ఎలా తెలుస్తుంది అనేగా మీ డౌట్. అవును నిజమే.

Last Updated : Apr 7, 2018, 04:20 PM IST
ఈ ఏడాది ఐపీఎల్‌లో గెలిచే జట్టు ఇదేనట..!

ముంబై: ఈ ఏడాది ఐపీఎల్-2018 విజేత ఎవరు? ఇంకా మ్యాచ్‌లే ప్రారంభం కాలేదు.. అప్పడే విజేత ఎవరో ఎలా తెలుస్తుంది అనేగా మీ డౌట్. అవును నిజమే. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఎవరికి  విజయావకాశాలు ఉన్నాయనే విషయాన్ని ప్రముఖ జ్యోతిష్కుడు, విశ్లేషకుడు గ్రీన్ స్టోన్ లోబో చెప్పారు.

అనుభవం ఉన్న కెప్టెన్లను దూరం చేసుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లకు విజయావకాశాలు తక్కువని చెప్పాడు లోబో. రెండేళ్ల నిషేధం ముగించుకొని ఐపీఎల్‌లో ఆడుతున్న  ఢిల్లీ డేర్ డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు కూడా ట్రోఫీ నెగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని జోస్యం చెప్పారు. ఇక మిగిలిన నాలుగు జట్లు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు,  కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లకు విజయావకాశాలు ఉన్నాయన్నారు. ఇందులో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌లకే ట్రోఫీ నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. లోబో చెప్పిన లెక్క ప్రకారం విరాట్‌ కోహ్లీ లేదా రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ ఇద్దర్లో ఒక్కరు ట్రోఫీ గెలుస్తారట. చూడాలి ఎం జరుగుతోందో!

ఇదిలా ఉండగా.. ఐపీఎల్-11వ సీజన్‌కు సంబంధించిన మ్యాచ్‌లు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. 11వ సీజన్‌లో భాగంగా మొదటి రోజున నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్  జట్లు తలపడనున్నాయి. మొదటి మ్యాచ్ నేడు రాత్రి 8గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ప్రారంభం కానుంది.

Trending News