MS Dhoni-Jadeja: ఎంఎస్ ధోనీ ముందు మోకరిల్లిన చెన్నై కెప్టెన్.. క్యాప్ తీసి సలాం కొట్టాడుగా! మహీనా మజాకా

Ravindra Jadeja bows down infront of MS Dhoni. ఎంఎస్ ధోనీ తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రవీంద్ర జడేజా కెప్టెన్‌ అయినా.. ఎంఎస్ ధోనీకి తగినంత గౌరవం ఇచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 03:49 PM IST
  • ఎంఎస్ ధోనీ ముందు మోకరిల్లిన చెన్నై కెప్టెన్
  • క్యాప్ తీసి సలాం కొట్టాడుగా
  • మహీనా మజాకా
MS Dhoni-Jadeja: ఎంఎస్ ధోనీ ముందు మోకరిల్లిన చెన్నై కెప్టెన్.. క్యాప్ తీసి సలాం కొట్టాడుగా! మహీనా మజాకా

CSK Captain Ravindra Jadeja bows down infront of MS Dhoni after victory against MI: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి బ్యాటర్, అద్భుత కెప్టెన్ మాత్రమే కాకూండా.. అంతకుమించి సూపర్ ఫినిషర్ కూడా. ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్ ఎవరు అంటే.. అందరూ మహీ పేరే చెబుతారు. ఆ పేరు ఊరికే రాలేదు.. చివరి ఓవర్లో 15-20 పరుగులు ఉన్నా, చివరి బంతికి సిక్స్ కొట్టాల్సి ఉన్నా ప్రశాంతంగా ఉంటూ పని పూర్తిచేశాడు మరి. ఇప్పటికే ఎన్నోసార్లు చివరి ఓవర్లో 15కు పైగా పరుగులు చేసిన ధోనీ.. గురువారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచులో కూడా అదే చేశాడు. 

ముంబై ఇండియన్స్ 155 పరుగులే చేసినా.. ఆ స్కోరును కాపాడుకునేందుకు చాలా ప్రయత్నం చేసింది. అద్భుతంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను చివరి బంతి వరకూ తీసుకొచ్చింది. చివరి ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 17 పరుగులు అవసరమైన వేళ.. మైదానంలోని అభిమానులంతా ధోనీ.. ధోనీ అనే నామస్మరణ చేయారు. రవీంద్ర జడేజా కెప్టెన్‌ అయినా.. మహీనే మా సారథి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమయంలో మరో బ్యాటర్ అయితే ఒత్తిడికి లోనై ఔట్ అవుతారు.. మహీ మాత్రం తమదైన శైలిలో మ్యాచ్ ముగించాడు. 

జయదేవ్‌ ఉనద్కత్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికే ఉపుమీదున్న డ్వేన్ ప్రిటోరియస్‌ (23) ఔట్ అయ్యాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన డ్వేన్ బ్రావో (1) రెండో బంతికి సింగిల్‌ తీశాడు. దీంతో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ ఎండ్‌లోకి వచ్చాడు. మూడో బంతిని లాంగాఫ్‌ మీదుగా సిక్సర్‌ బాదిన మహీ.. నాలుగో బంతిని డీప్‌ ఫైన్‌ లెగ్‌లో బౌండరీకి తరలించాడు. ఐదో బంతికి రెండు పరుగులు తీసిన ధోనీ.. చివరి బంతిని లాంగ్‌ లెగ్‌లో బౌండరీ బాది చెన్నైకి అపురూప విజయాన్ని అందించాడు. 

ఎంఎస్ ధోనీ తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. మహీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రవీంద్ర జడేజా కెప్టెన్‌ అయినా.. ఎంఎస్ ధోనీకి తగినంత గౌరవం ఇచ్చాడు. మ్యాచ్‌ గెలిచాక మైదానంలోకి వచ్చిన జడేజా.. తన మాజీ కెప్టెన్ ముందు మోకరిళ్లాడు. జడ్డూ తన క్యాప్‌ తీసి తలవంచి నమస్కరించాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఫాన్స్ అందరూ జడేజా చేసిన పనికి ఫిదా అవుతున్నారు. 

Also Read: Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ లో సూపర్ సేల్.. రూ.559లకే Redmi Note 10T స్మార్ట్ ఫోన్!

Also Read: Corona Guidelines Delhi: పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. రాష్ట్రంలోని పాఠశాలలకు కీలక ఆదేశాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News