Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరో ప్లేయర్‌కు కరోనా పాజిటివ్.. నేటి మ్యాచ్‌‌ వాయిదా!

IPL 2022, DC vs PBKS: One More Covid 19 case in Delhi Capitals. కరోనా వైరస్ మహమ్మారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదలడం లేదు. తాజాగా మరో ఆటగాడికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2022, 05:40 PM IST
  • ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని వదలని కరోనా
  • ఢిల్లీ జట్టులో మరొకరికి కరోనా
  • పంజాబ్‌తో నేటి మ్యాచ్‌‌ వాయిదా
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరో ప్లేయర్‌కు కరోనా పాజిటివ్.. నేటి మ్యాచ్‌‌ వాయిదా!

IPL 2022, DC vs PBKS: One More Delhi Capitals player test positive for Covid 19: కరోనా వైరస్ మహమ్మారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదలడం లేదు. ఇప్పటికే ఐదుగురు వైరస్‌ బారిన పడగా.. తాజాగా మరొకరికి కరోనా సోకింది. ఢిల్లీ జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హార్ట్, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్, మసాజ్‌ థెరపిస్ట్‌ చేతన్‌ కుమార్‌, డాక్టర్‌ అభిజిత్‌ సాల్వి, సోషల్‌ మీడియా సభ్యుడు ఆకాశ్‌ మనేలు ఇప్పటికే వైరస్‌ బారిన పడగా.. తాజాగా మరో ఆటగాడికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. 

ఢిల్లీ జట్టులో కరోనా వైరస్ బారిన పడిన ప్లేయర్ ఎవరు అన్న దానిపై స్పష్టత లేదు. అయితే జాతీయ మీడియా కథనం ప్రకారం విదేశీ ఆటగాడు మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తోంది. టీమ్ సీఫెర్ట్ వైరస్ బారిన పడినట్లు సమాచారం. సీఫెర్ట్ మంగళవారం ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఢిల్లీ ఆటగాళ్లు అందరూ అతడితో కాంటాక్ట్ అయ్యారు. దాంతో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అయ్యే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచుపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

ముందస్తు చర్యల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాడికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందట. దాంతో మొత్తంగా ఆరు కేసులు ఢిల్లీ జట్టులో నమోదయ్యాయి. ఇక మ్యాచ్‌కు ముందు బీసీసీఐ మరో రౌండ్ పరీక్షలను చేస్తుందట. ఇందుకోసం డోర్ టు డోర్ టెస్టింగ్‌ను ఏర్పాటు చేసిందట. టెస్టు రిపోర్టులు నెగిటివ్‌గా వచ్చిన ఆటగాళ్లతో మ్యాచ్ ఆడే (మ్యాచ్ జరిగితే) అవకాశాలు ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

కరోనా వైరస్‌ మహమ్మారి విస్తరించే అవకాశాలు ఉండటంతో ఇప్పటికే పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ వేదికను పూణే నుంచి ముంబైకి మార్చిన విషయం తెలిసిందే. కఠిన బయో బబుల్‌లో ఐపీఎల్ 2022 మ్యాచ్‌లని బీసీసీఐ నిర్వహిస్తున్నా.. మహమ్మారి బుడగను దాటుకొని వస్తోంది. అయితే ఢిల్లీ జట్టువరకే వైరస్ వ్యాప్తి ఉండడం కాస్త సంతోషించాల్సిన విషయం. 

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ బ్రెయిన్ ఫ్రై అయిపొయింది.. రీఫ్రెష్‌తో రీఎంట్రీ ఇవ్వాలంటే..! రవిశాస్త్రి అడ్వైజ్ ఇదే

Also Read: KL Rahul: ఐపీఎల్‌ రూల్స్ ఉల్లంఘన.. కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా! స్టొయినిస్‌కు వార్నింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News