IPL 2023: సీఎస్కే ఓటమికి కారణం ఆ ఓవర్, ఆ బౌలర్ ఖరీదు 14 కోట్లు

IPL 2023: ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ విజయం సాధించింది. గెలవాల్సిన మ్యాచ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ చేజేతులా కోల్పోయింది. 14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆ బౌలరే ఓటమికి కారణమా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 1, 2023, 07:59 AM IST
IPL 2023: సీఎస్కే ఓటమికి కారణం ఆ ఓవర్, ఆ బౌలర్ ఖరీదు 14 కోట్లు

IPL 2023: ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగింది. 4 సార్లు టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్..డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కారణాలేంటో తెలుసుకుందాం..

వాస్తవానికి నిన్న జరిగిన ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో సీఎస్కే జట్టు విజయం సాధించాల్సిన పరిస్థితి. కానీ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. చెన్నై ఓటమికి ఆ ఒక్క ఓవరే కారణంగా చెప్పాలి. 14 కోట్లు వెచ్చించి మరీ చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్న ఆ బౌలర్ ఓటమికి బాధ్యత వహించాలనే విమర్శలు విన్పిస్తున్నాయి. అతడి ఒక్క ఓవర్ మొత్తం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. సీఎస్కేను కొంపముంచేసింది.

మార్చ్ 31వ తేదీ నిన్న జరిగిన ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి 179 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ లక్షాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 156 పరుగుల వద్ద ఉంది. ఈ పరిస్థితితో గెలుపు కచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ వైపుకే కన్పించింది. అందరూ అదే ఊహించారు. సరిగ్గా అప్పుడు స్పెల్ చేసిన 19వ ఓవర్ మొత్తం మ్యాచ్ స్వరూపం మార్చేసింది. భారీ మూల్యం చెల్లించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. 19వ ఓవర్‌ను జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాడు దీపక్ చాహర్ చేశాడు. దీపక్ చాహర్ చేసిన ఈ ఓవర్ చెన్నై సూపర్ కింగ్స్ కొంపముంచేసింది.

దీపక్ చాహర్ ఓవర్‌తో మూల్యం చెల్లించుకున్న సీఎస్కే

దీపక్ చాహర్ 19వ ఓవర్ వేసే సమయానికి గుజరాత్ టైటాన్స్ జట్టు 12 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో 19వ ఓవర్ అత్యంత జాగ్రత్తగా వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఓవర్‌లో ఎంత తక్కువ పరుగులిస్తే చివరి ఓవర్ ప్రత్యర్ధి జట్టుపై అంతగా ఒత్తిడి పెరుగుతుంది. కానీ దీపక్ చాహర్ ఈ ఓవర్‌లో ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్ తనపరం చేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. సీఎస్కే తరపున రుతురాత్ గైక్వాడ్ అత్యధికంగా 50 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అటు గుజరాత్ టైటాన్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటర్ శుభమన్ గిల్ 36 బంతుల్లో 63 పరుగులు చేయడం విశేషం.

Also read: Kaviya Maran To Isha Negi: ఐపిఎల్‌లో హైలైట్ అయిన గాళ్స్.. ఐపిఎల్ 2023 లోనూ సందడి చేసేనా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News