DC vs CSK Live Updates: టాస్ గెలిచిన పంత్.. ఇరు జట్లు ఫ్లేయింగ్ 11 ఇదే..!

DC vs CSK Live Updates: మరికొన్ని క్షణాల్లో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిట‌ల్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.  ఢిల్లీ జట్టులో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

Written by - Samala Srinivas | Last Updated : Mar 31, 2024, 07:56 PM IST
DC vs CSK Live Updates: టాస్ గెలిచిన పంత్.. ఇరు జట్లు ఫ్లేయింగ్ 11 ఇదే..!

IPL 2024, DC vs CSK Live Updates: ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో డ‌బుల్ హెడ‌ర్ లో భాగంగా.. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. విశాఖ‌పట్ట‌ణం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారి ఎలాగైనా బోణీ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు సీఎస్కే హ్యాట్రిక్ పై కన్నేసింది. 

ఐపీఎల్ 2024లో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్ కావడం విశేషం. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచుల్లో సీఎస్కే నాలిగింటిలో, ఢిల్లీ ఒక దాంట్లో గెలిచాయి.  ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఢిల్లీ తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు సీఎస్కే ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. విశాఖపట్నం పిచ్ బ్యాటింగ్ కు ఎక్కువగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో 13 ఐపీఎల్ మ్యాచులు జరగ్గా.. 7 మ్యాచులను సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. 

Also Read: SRH vs GT Highlights: సుదర్శన్, మిల్లర్ మెరుపులు.. సన్ రైజర్స్ పై గుజరాత్ ఘన విజయం..

ఢిల్లీ (ప్లేయింగ్ XI)- పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్ట్జే, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
చెన్నై (ప్లేయింగ్ XI) - రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా.

Also Read: LCG Vs PBKS Highlights: మయాంక్ యాదవ్ మెరుపు బౌలింగ్.. పంజాబ్‌కు లక్నో పంచ్.. ఉత్కంఠభరిత పోరులో ధావన్ సేన ఓటమి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News