IPL 2024 Playoffs: ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌ సమీకరణలు ఇవే.. ఆ నాలుగు జట్లకే ఛాన్స్‌..!

IPL 2024 Playoffs Prediction: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరగా మారుతోంది. ఆర్‌సీబీ మినహా మిగిలిన అన్ని జట్లు టాప్-4కి రేసులో ఉన్నాయి. ఏ జట్టుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి..? ఏ జట్టు ఖాతాలో ఎన్ని పాయింట్లు ఉన్నాయి..? పూర్తి సమీకరణలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 25, 2024, 01:59 PM IST
IPL 2024 Playoffs: ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌ సమీకరణలు ఇవే.. ఆ నాలుగు జట్లకే ఛాన్స్‌..!

IPL 2024 Playoffs Prediction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆర్‌సీబీ ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించగా.. మిగిలిన 9 జట్లు నాలుగు స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకుని.. టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆ జట్టు మరో మ్యాచ్‌ గెలిపిస్తే.. ప్లే ఆఫ్స్‌లో బెర్త్ కన్ఫార్మ్ అయిపోతుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ సీజన్‌లో ఊహించని విధంగా ఆడుతున్నాయి. భారీ విజయాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి.. చెరో 10 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇదే ఆటతీరును కనబరిస్తే ప్లే ఆఫ్స్‌లో బెర్త్‌లు కన్ఫార్మ్ చేసుకోవడం ఖాయం.

Also Read: CM Jagan Mohan Reddy: మా చిన్నాన్నను ఎవరు చంపారో తెలుసు.. వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు 

లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 10 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి దూకుడు పెంచింది. అటు చెన్నై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ప్లే ఆఫ్ రేసులో కాస్త వెనుకబడింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించగా.. నాలుగింటిలో ఓడిపోయింది. 8 పాయింట్లతో ఐదోస్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటిల్స్ మళ్లీ విజయాల బాటపట్టింది. గుజరాత్‌పై థ్రిల్లింగ్ విక్టరీతో ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, ఐదు ఓటములతో ఆరోస్థానంలో ఉంది. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింటిలో విజయం సాధించాల్సి ఉంటుంది.
 
కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. ఈ సీజన్‌లో పడుతూ లేస్తోంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్ బాగానే ఆడుతున్నా.. జట్టుగా ఆడడంలో విఫలమవుతున్నారు. ఒకరు ఒక మ్యాచ్‌లో ఆడితే.. మరో మ్యాచ్‌లో తేలిపోతున్నారు. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న ముంబై.. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో కచ్చితంగా ఐదు గెలవాల్సిందే. ఈ సీజన్‌లో కూడా పంజాబ్ కింగ్స్‌ ఆటతీరులో పెద్దగా మార్పులు రాలేదు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 

ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు సాధించి.. కింద నుంచి రెండో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా విజయం సాధించాల్సిందే. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ సీజన్ ఓ పీడకలగా మిగిలిపోనుంది. 8 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ కేవలం ఒక్క విజయం సాధించి.. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో గెలిచినా.. అద్భుతం జరిగితే తప్పా ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టం.   

Also Read: Renault Kiger Price: టాటా పంచ్‌తో పోటీ పడుతున్న Renault Kiger.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇలా! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News