SRH Vs RR: తొలి పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రెడీ.. రాజస్థాన్‌తో ఢీ.. తుది జట్లు ఇవే..

Sunrisers Hyderabad Vs Rajasthan Royals Playing 11: ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. సరికొత్తగా బరిలోకి దిగుతున్న హైదరాబాద్.. తొలి పోరులో ఎలా రాణిస్తుందోననే ఆసక్తి నెలకొంది. హెడ్ టు హెడ్ రికార్డులు ఓసారి పరిశీలిస్తే.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2023, 11:54 AM IST
SRH Vs RR: తొలి పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రెడీ.. రాజస్థాన్‌తో ఢీ.. తుది జట్లు ఇవే..

Sunrisers Hyderabad Vs Rajasthan Royals Playing 11: ఐపీఎల్ 2023లో తొలి సమరానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్‌తో సొంతగడ్డపై హైదరాబాద్ జట్టు ఎలా తలపడనుందని ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌కు మార్క్‌క్రమ్ దూరమవ్వడంతో భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అటు సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ పటిష్టంగా కనిపిస్తోంది. తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి..? 

హైదరాబాద్ పిచ్ ఇలా..

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బ్యాట్స్‌మెన్‌తోపాటు ఫాస్ట్ బౌలర్లు కూడా సహాకరిస్తుంది. స్పిన్నర్లకు ఇక్కడ పెద్దగా సహరించదు. ఐపీఎల్ 2018 నుంచి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ఫాస్ట్ బౌలర్లు 8.07 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశారు. 25.17 బౌలింగ్ సగటుతో వికెట్లు తీశారు. మన దేశంలోని ఇతర గ్రౌండ్‌ల కంటే.. ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శన ఉప్పల్ స్టేడియంలోనే చాలా బాగుంది. ఇక్కడ ఛేజింగ్ చేయడం కొంచెం తేలికగా ఉంటుంది. గత రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరోసారి టాస్ కీలకంగా మారే అవకాశం ఉంది. 

హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా.. 

సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇప్పటివరకు హోరాహోరీ పోరు జరిగింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొత్తం 16 మ్యాచ్‌లు తలపడ్డాయి. ఈ 16 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ 8, రాజస్థాన్ 8 మ్యాచ్‌లు గెలిచాయి. మరోసారి రెండు జట్లు నువ్వా నేనా రీతిలో తలపడే అవకాశ ఉంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ ఎస్‌ఆర్‌హెచ్ గెలుపొందింది. గత సీజన్‌లో తలపడిన ఒక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 

ఐపీఎల్ గత సీజన్‌తో పోలిస్తే రాజస్థాన్ జట్టులో ఈసారి కూడా పెద్దగా మార్పు లేదు. జట్టులోని ప్లేయింగ్-11లోని చాలా మంది ఆటగాళ్లు గత సీజన్‌లోని ఆడిన ఆటగాళ్లే ఉండబోతున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే జేసన్ హోల్డర్ వంటి స్టార్ ఆల్ రౌండర్ ప్రవేశంతో మరింత బలోపేతంగా మారింది. మరోవైపు హైదరాబాద్ జట్టు ఈసారి కొత్తగా బరిలోకి దిగుతోంది. మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్ వంటి ఆటగాళ్ల చేరితో బ్యాటింగ్‌ ఆర్డర్ బలోపేతమైంది. బౌలింగ్‌లో ఆదిల్ రషీద్ లాంటి స్పిన్నర్ చేరికతో బౌలంగ్ విభాగం కూడా బలంగా మారింది.

రెండు జట్లు ప్లేయింగ్-11 ఇలా (అంచనా)..

సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), అకిల్ హొస్సేన్ /ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్.

రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్‌మెయర్, రియాన్ పరాగ్, ఆర్.అశ్విన్, ఆకాష్ వశిష్ట్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్.

Also Read: Investment Tips: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి

Also Read: Kane Williamson: అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు.. కానీ వెంటాడిన దురదృష్టం.. సీజన్ మొత్తానికి దూరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News