5-0తో టీమిండియాను క్లీన్‌స్వీప్‌ చేయడం సాధ్యమే: ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్

లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ అపజయాన్ని నిందించలేమని.. టీమిండియా ఆడాల్సిన విధంగానే ఆడిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అభిప్రాయపడ్డారు. 

Last Updated : Aug 13, 2018, 09:09 PM IST
5-0తో టీమిండియాను క్లీన్‌స్వీప్‌ చేయడం సాధ్యమే: ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్

లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ అపజయాన్ని నిందించలేమని.. టీమిండియా ఆడాల్సిన విధంగానే ఆడిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అభిప్రాయపడ్డారు. కాకపోతే రెండవ టెస్టులో పూర్తిస్థాయిలో బౌలింగ్ బలం మీదే ఆధారపడ్డామని.. అదే తమకు కలిసొచ్చిందని ఆయన అన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే విధంగా ప్లానింగ్ చేయడం ఇంగ్లాండ్ ఆటగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని.. ఆ ఒత్తిడికి భారత్ మాత్రమే కాదు.. ఏ జట్టు అయినా లొంగాల్సిందేనని జో రూట్ అన్నారు.

ఐదు టెస్టుల సిరీస్‌లో తాము 2-0తో ముందంజలో ఉన్నప్పటికీ కోహ్లీ జట్టును తక్కువ అంచనా వేయలేమని జో రూట్ అన్నారు. భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించడం కష్టమేనని తాను భావిస్తున్నానని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే.. 5-0తో టీమిండియాను క్లీన్‌స్వీప్‌ చేయడం అసాధ్యం ఏమీ కాదని.. కానీ తాము తొలుత మూడవ టెస్టు గురించి మాత్రమే ఆలోచిస్తామని.. ప్రత్యర్థి గేమ్ ప్లాన్ అర్థం చేసుకోవడం ముఖ్యమని అన్నారు. 

అలాగే ఆండర్సన్ బౌలింగ్ పై కూడా జో రూట్ ప్రశంసల వర్షం కురిపించారు. అలాంటి ఆటగాడు దొరకడం తమ అదృష్టమని ఆయన పేర్కొన్నారు. టెస్టులలో లెజెండరీ ఆస్ట్రేలియా బౌలర్  మెక్‌గ్రాత్‌ రికార్డును (563 వికెట్లు)ను అందుకునేందుకు అండర్సన్‌ 10 వికెట్ల దూరంలో ఉన్నాడని.. బహుశా ఆ రికార్డు అతను బ్రేక్ చేస్తాడని తాను ఆశిస్తున్నానని జో రూట్ తెలిపారు. 

Trending News