Michael Vaughan: మైఖేల్ వాన్‎కు బీబీసీ షాక్...షోలో పాల్గొనకుండా వేటు!

ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్‌పై ప్రముఖ వార్త సంస్థ బీబీసీ నిషేధం విధించింది. వాన్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 06:13 PM IST
Michael Vaughan: మైఖేల్ వాన్‎కు బీబీసీ షాక్...షోలో పాల్గొనకుండా వేటు!

Michael Vaughan: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే..ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్(Michael Vaughan) పై ఓ వార్త సంస్థ నిషేధం విధించింది. జాత్యాహంకార ఆరోపణల(racism allegation) నేపథ్యంలో..వాన్ పై ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ(BBC) ఈ నిర్ణయం తీసుకుంది. తమ ఛానల్‌లో ప్రసారమయ్యే "ద టఫర్స్‌ అండ్‌ వాన్‌ క్రికెట్‌ షో" నుంచి వాన్‌ను తప్పిస్తున్నట్లు శనివారం ప్రకటన విడుదల చేసింది. వాన్‌ బీబీసీలో గత 12 ఏళ్లుగా టెస్ట్‌ మ్యాచ్‌ విశ్లేషకుడిగా పనిచేస్తున్నాడు.

2009లో నాటింగ్హమ్‌తో మ్యాచ్‌ సందర్భంగా తనతో పాటు జట్టులోని పలువురు సభ్యులపై వాన్‌ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశాడని యార్క్‌షైర్‌ ఆటగాడు అజీమ్‌ రఫీక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీబీసీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రఫీక్ ఆరోపణలను మైఖేల్ వాన్‌ ఖండించాడు. రఫిక్ ఆరోపణలు నిరాధారమని చెప్పాడు.

Also read: Rashid Khan To Ashwin: అశ్విన్, రషీద్ ఖాన్ మధ్య ఆసక్తికర సంభాషణ.. రషీద్ ఖాన్ తెలుగు ట్వీట్ వైరల్

1991 నుంచి 2009 వరకు ఇంగ్లండ్‌ జట్టు(England Cricket Team)కు ప్రాతినిధ్యం వహించిన వాన్‌.. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్లను టార్గెట్‌ చేస్తూ వాన్‌ చాలాసార్లు తన నోటికి పని చెప్పాడు. ఇదిలా ఉంటే, జాతి వివక్షపై కుప్పలు తెప్పలుగా ఆరోపణలు రావడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) యార్క్‌షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ (వైసీసీసీ)పై సస్పెన్షన్‌ వేటు వేసింది. వాన్‌పై ఫిర్యాదు చేసిన రఫీక్‌ ఇదే కౌంటీ తరఫున 2008–2018 వరకు ప్రాతినిధ్యం వహించాడు. 

గత ఆదివారం న్యూజిలాండ్‎తో ఓటమి తర్వాత భారత్ ఆటగాళ్లపై మైకేల్ వాన్ విమర్శలు గుప్పించారు. ఇంత ప్రతిభ ఉండి, పెద్ద జట్టుగా పేరొందిన టీమిండియా(Teamindia) టీ20 క్రికెట్‌లో దారుణంగా విఫలమవుతుందని ట్వీట్ చేశాడు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నిర్వహిస్తున్న అన్ని లీగ్‌ మ్యాచ్‌లలో ఆడేందుకు భారత క్రికెటర్లకు అనుమతినివ్వాలని బీసీసీఐ(BCCI)కి మైకేల్‌ వాన్‌ సూచించాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News