వీడియో: వారెవ్వా... స్టన్నింగ్ క్యాచ్ పట్టిన ధోని

అద్భుతమైన క్యాచ్ పట్టిన మహేంద్ర సింగ్ ధోని

Last Updated : Oct 27, 2018, 11:06 PM IST
వీడియో: వారెవ్వా... స్టన్నింగ్ క్యాచ్ పట్టిన ధోని

విండిస్‌తో జరగనున్న T20I సిరిస్, ఆస్ట్రేలియాతో సిరీస్‌లకు టీమిండియా సెలెక్టర్లు మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనిని తీసుకోకపోవడంపై రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. ఇక ధోని టీ20 కెరీర్ ముగిసినట్టేనా అనే చర్చలు కూడా జరిగాయి. కానీ ధోనీ మాత్రం అదేమీ తనకు పట్టనట్టుగా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇవాళ విండీస్ తో పూణె వేదికగా జరుగుతున్న 3వ వన్డేలో ధోనీ పట్టుకున్న ఓ అద్భుతమైన క్యాచ్ అందుకు నిదర్శనం. తనలోని ఫిట్ నెస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. 

మ్యాచ్ 6వ ఓవర్‌లో జస్ర్పిత్ బుమ్రా విసిరిన బంతికి బ్యాట్స్‌మెన్ చంద్రపాల్ హేమరాజ్ హిట్ ఇవ్వడానికి ప్రయత్నించగా అది ఎడ్జ్‌పై తగిలి గాల్లోకి లేచింది. దీంతో 20 గజాల దూరంలో కిందపడుతున్న బంతివైపు మెరుపు వేగంతో పరుగెత్తిన ధోని.. బంతి కిందపడకుండా అమాంతం ఫుల్ డైవ్ చేసి క్యాచ్ పట్టుకున్నాడు. ధోని పట్టుకున్న ఈ క్యాచ్ చూస్తే, అతడు ఫిట్‌నెస్ ఏంటో అర్థమైపోతుందంటున్నారు క్రికెట్ ప్రియులు.

Trending News