Rishi Dhawan Face Mask: ఎంఎస్ ధోనీకి బయపడే.. రిషి ధావన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకున్నాడు!

Rishi Dhawan wearing a Face Shield mask. రిషి ధావన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకోవడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి భయపడే రిషి ధావన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకున్నాడని ట్వీట్లు చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2022, 03:00 PM IST
  • ఫేస్‌గార్డ్‌తో పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌
  • బౌలింగ్ కంటే.. ఫేస్‌గార్డ్‌ పెట్టుకోవడమే పెద్ద చర్చనీయాంశం
  • ధోనీకి బయపడే.. రిషి ధావన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకున్నాడు
Rishi Dhawan Face Mask: ఎంఎస్ ధోనీకి బయపడే.. రిషి ధావన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకున్నాడు!

Rishi Dhawan wearing a Face mask due to Fear Of MS Dhoni: పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రిషి ధావన్‌ ఐదేళ్ల తర్వాత ఐపీఎల్‌ టోర్నీలో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సోమవారం వాంఖడే స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషి తన అద్భుత బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. తన కోటా 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మెగా టోర్నీలో ఐదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి.. మ్యాచ్‌ విజయంలోనూ కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రిషి ధావన్‌ తన బౌలింగ్ కంటే.. ఫేస్‌గార్డ్‌ పెట్టుకోవడమే పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

ఐపీఎల్‌ 2022కు ముందు జరిగిన దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో రిషి ధావన్‌ బౌలింగ్‌ చేస్తూ గాయపడ్డాడు. బ్యాటర్ కొట్టిన షాట్‌కు రిషి ముక్కు పగిలి రక్తం బయటికి వచ్చింది. బంతి బలంగా తాకడంతో అతడికి పెద్ద గాయామే అయింది. దీంతో ముక్కుకు సర్జరీ చేయించుకున్న రిషి.. ఐపీఎల్‌ 2022 ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. సోమవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముందస్తు చర్యలో భాగంగా రిషి ఫేస్‌గార్డ్‌ పెట్టుకొని బౌలింగ్‌ చేశాడు.

అయితే రిషి ధావన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకోవడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి భయపడే రిషి ధావన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకున్నాడని ట్వీట్లు చేస్తున్నారు. వాంఖడేలో ఎంఎస్ భారీ షాట్లు ఆడిన విషయం తెలిసిందే. అయితే మహీ ఓ ఫోర్, బౌండరీ బాది ఔట్ అయ్యాడు. రిషి బౌలింగ్‌లోనే ధోనీ ఓ భారీ సిక్స్ బాదాడు. అంతకుముందు మ్యాచులో ధోనీ కొట్టిన ఓ షాట్ నుంచి జయదేవ్ ఉనద్కత్ తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. అందుకే నెటిజన్లు సరదాగా ట్వీట్లు చేశారు. 

'ఎంఎస్ ధోనీకి భయపడే రిషి ధావన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకున్నాడు', 'ధోనీకి చివరి ఓవర్ బౌలింగ్ చేస్తాడని ఊహించే ఫేస్‌గార్డ్‌ పెట్టుకున్నాడు', 'రిషి ధావన్ కోడి రోడ్స్‌లా కనిపిస్తున్నాడు', 'కొత్త ఫేస్ మాస్క్‌ను ప్రమోట్ చేస్తున్న రిషి ధావన్', 'ముఖానికి మాస్క్‌తో రిషి ధావన్.. WWE కోసం సిద్ధంగా ఉన్నాడు' అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీలో హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి టైటిల్‌ గెలవడంలో రిషి కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ప్రదర్శన కారణంగానే పంజాబ్‌ కింగ్స్‌ రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది.

Also Read: Karnataka Bible Controversy: హిజాబ్ ఘటన తర్వాత కర్ణాటకలో ఇప్పుడు మరో వివాదం!

Also Read: Ruia Ambulance Mafia: ఈ కష్టం ఎవరికీ రాకూడదు..తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో హృదయవిదారక ఘటన.. మృతదేహాన్ని బైక్ పై తరలింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News