T10 League 2021 Coaches: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. పురుషుల జట్టుకు మహిళా కోచ్

T10 League 2021 Coaches: టీ10 లీగ్ ఐదో సీజన్ లో అబుదాబి ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్​ చరిత్రలో తొలిసారి ఫ్రాంచైజీ క్రికెట్​లో ఓ మహిళా క్రికెటర్​ తమ టీమ్ కు కోచ్​గా బాధ్యతలు స్వీకరించనుంది. తమ జట్టుకు అసిస్టెంట్​ కోచ్​గా ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్​ను (Sarah Taylor Coach) నియమిస్తున్నట్లు ట్వీట్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2021, 07:22 PM IST
T10 League 2021 Coaches: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. పురుషుల జట్టుకు మహిళా కోచ్

T10 League 2021 Coaches: టీ10 లీగ్​ ఐదో సీజన్ నిర్వహణకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో టీమ్​ అబుదాబి చారిత్రక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ చరిత్రలో ఓ పురుషుల జట్టుకు తొలిసారిగా మహిళా క్రికెటర్​ను కోచ్​గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ఫ్రాంచైజీ పేర్కొంది. మాజీ ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్ (Sarah Taylor Coach).. టీమ్​ అబుదాబికి అసిస్టెంట్​ కోచ్​గా ఎంపికైనట్లు ట్విట్టర్​లో వెల్లడించింది.  

"చరిత్ర సృష్టించాం. ఐదో సీజన్ టీ10 లీగ్​ నేపథ్యంలో సారా టేలర్​ను అబుదాబి జట్టుకు (Abu Dhabi Team T10) కోచ్​గా నియమిస్తున్నాం. ఫ్రాంచైజీ క్రికెట్​లో ఓ పురుషుల క్రికెట్​ జట్టుకు మహిళ కోచ్​గా ఎంపికవడం ఇదే తొలిసారి" అని అబుదాబి ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది.

సారా టేలర్.. 2019లో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు (Sarah Taylor Retirement) పలికింది. తన క్రికెట్ కెరీర్​లో సారా.. ఇంగ్లాండ్ తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20 మ్యాచ్​లు ఆడింది. ఉత్తమ మహిళా వికెట్ కీపర్ బ్యాటర్​గానూ రాణించింది.

అబుదాబి ఫ్రాంచైజీలో కీలక ఆటగాళ్లు..

టీమ్​ అబుదాబిలో (Abu Dhabi Team T10) క్రిస్ గేల్, లివింగ్​స్టోన్, పాల్ స్టిర్లింగ్ వంటి కీలక ఆటగాళ్లున్నారు. వీరితో పాటు లాంగే, మెక్​కాయ్, కొలిన్ ఇంగ్రామ్, డానీ బ్రిగ్స్, ఫైడల్ ఎడ్వర్డ్స్, నవీన్ ఉల్ హక్ ఉన్నారు. నవంబర్ 19 నుంచి ఈ టీ10 లీగ్ ప్రారంభం (T10 League 2021 Schedule) కానుంది.

Also Read: Warner imitate Ronaldo: రొనాల్డోను అనుకరించిన డేవిడ్​ వార్నర్​- ప్రెస్​ కాన్ఫరెన్స్​లో నవ్వులు!  

Also Read: David Warner IPL Auction: ‘సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నన్ను రిటైన్ చేసుకోవడం కష్టమే‘  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News