T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022లో ఆ రెండు జట్లే ఫెవరెట్.. షేన్ వాట్సన్ జోస్యం!

Shane Watson Picks India And Australia to win T20 World Cup 2022. ఆస్ట్రేలియా, భారత్‌ జట్లను తాను టీ20 ప్రపంచకప్ 2022 టైటిల్ ఫేవరెట్లుగా భావిస్తున్నట్లు షేన్ వాట్సన్ చెప్పాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 30, 2022, 07:04 PM IST
  • టీ20 ప్రపంచకప్ 2022లో ఆ రెండు జట్లే ఫెవరెట్
  • షేన్ వాట్సన్ జోస్యం
  • మైదానాలు చాలా పెద్దవి
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022లో ఆ రెండు జట్లే ఫెవరెట్.. షేన్ వాట్సన్ జోస్యం!

Shane Watson feels India or Australia to win T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌ 2022కు సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం అన్ని టీమ్స్ జట్లను ప్రకటించి.. సన్నద్ధమవుతున్నాయి. మరో 15 రోజుల్లో పొట్టి సమరంకు తెరలేవనుండడంతో.. మాజీలు అందరూ తమతమ అభిప్రాయాలు చెపుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్ వాట్సన్ స్పందించాడు. ఆస్ట్రేలియా, భారత్‌ జట్లను తాను టైటిల్ ఫేవరెట్లుగా భావిస్తున్నట్లు చెప్పాడు. సొంతగడ్డ పరిస్థితులను ఆసీస్ ఉపయోగించుకుంటుందని కూడా అన్నాడు. 

రాయ్‌పూర్‌లో జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో షేన్ వాట్సన్ ఆడుతున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన ప్రెస్ సమావేశంలో వాట్సన్ మాట్లాడుతూ టీ20 ప్రపంచకప్‌ 2022పై స్పందించాడు. 'ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ బాగా ఆడింది. కాబట్టి టైటిల్ ఫేవరేట్లలో భారత్ ఒకటి. ఆస్ట్రేలియాకు కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఇరు జట్లు మంచి టీ20 క్రికెట్ ఆడుతున్నాయి. ఈ రెండు జట్లకు కప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి' అని వాట్సన్ అన్నాడు.  

'ఆస్ట్రేలియాలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మైదానాలు చాలా పెద్దవి కూడా. వికెట్ల వేగం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆస్ట్రేలియన్లు సొంత పరిస్థితులను బాగా ఉపయోగించుకుంటారు' అని షేన్ వాట్సన్ చెప్పాడు. గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2021లో భారత్ టైటిల్ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగి నిరాశపరిచిన విషయం తెలిసిందే. పేలవ ఆటతో లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియా టోర్నీ ఆసాంతం రాణించి టైటిల్ కైవసం చేసుకుంది.  

Also Read: 'ది ఘోస్ట్‌' రిలీజ్‌ ట్రైలర్‌ వచ్చేసింది.. ఇరగదీసిన కింగ్ నాగార్జున!

Also Read: IND vs SA: కెప్టెన్‌గా ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News