T20 World Cup IND vs PAK: రాహుల్‌, ధోనిలను బతిమలాడిన పాక్ అభిమానులు

Pakistan fans urge MS Dhoni, KL Rahul :పాకిస్తాన్‌కు చెందిన కొందరు అభిమానులు భారత ఆటగాళ్లను ఒక కోరిక కోరారు. ప్లీజ్‌ మీరు సరిగా ఆడొద్దంటూ భారత క్రీడాకారులను వేడుకొంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2021, 07:16 PM IST
  • భారత్, పాక్ జట్ల మధ్య హైఓల్టేజ్ మ్యాచ్‌
  • నరాలు తెగే ఉద్వేగంలో రెండు దేశాల అభిమానులు
  • ప్లీజ్‌ మీరు సరిగా ఆడొద్దంటూ భారత క్రీడాకారులను వేడుకొంటున్న పాక్ అభిమానులు
T20 World Cup IND vs PAK: రాహుల్‌, ధోనిలను బతిమలాడిన పాక్ అభిమానులు

Please, not this match.. Pakistan fans urge MS Dhoni, KL Rahul : భారత్, పాక్ జట్ల మధ్య హైఓల్టేజ్ మ్యాచ్‌ మరికొన్ని క్షణాల్లో మొదలవ్వనుంది. నరాలు తెగే ఉద్వేగంలో రెండు దేశాల అభిమానులు ఉన్నారు. అయితే పాకిస్తాన్‌కు (Pakistan) చెందిన కొందరు అభిమానులు భారత ఆటగాళ్లను ఒక కోరిక కోరారు. ప్లీజ్‌ మీరు సరిగా ఆడొద్దంటూ భారత క్రీడాకారులను (Indian players) వేడుకొంటున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : T20 World Cup : అతను చివరి 2 బంతులల్లోనూ 12 స్కోరు చేయగల దమ్మున్నోడు ‌‌- హర్భజన్

దుబాయ్‌ స్టేడియంలో భారత ఓపెనర్‌ కేఎల్ రాహుల్ (KL Rahul) తన ప్రాక్టీస్ ముగించుకొని వెళ్తుండగా పాకిస్థాన్ ఫ్యాన్స్ (Pakistan Fans) కేకలేసి పిలిచారు. స్టేడియం బయట నిలబడి ఉన్న యువతులు రాహుల్‌ ఒక కోరిక కోరారు. రాహుల్ మ్యాచ్‌లో దయచేసి మంచిగా ఆడకు. వద్దు.. ప్లీజ్ రేపటి మ్యాచ్‌లో సరిగా ఆడకు అంటూ బతిమలాడారు.

ఆ తర్వాత ధోని (MS Dhoni) వచ్చాడు. ధోనిని కూడా పాకిస్తాన్ ఫ్యాన్ అలాగే బతిమలాడింది. అలాగే మరికొందరు పాకిస్తాన్‌ ప్యాన్స్.. ధోనిని ఉద్దేశించి.. మహీ.. వచ్చే మ్యాచ్‌ (India vs pakistan match) ఒక్కటి వదిలేయ్. ఈ మ్యాచ్ వద్దు ప్లీజ్ అంటూ వేడుకున్నారు.

Also Read : T20 World Cup 2021 : బాబర్‌ నువ్వు అస్సలు భయపడకు ‌‌- షోయబ్‌ అక్తర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News