కోహ్లీ.. అనుష్క పెళ్లి వార్త; ఈసారైనా నిజమేనా!?

కోహ్లీ-అనుష్క పెళ్లి వార్తల వారు ప్రేమించుకుంటున్నప్పటి నుంచి చక్కర్లు కొడుతోంది. కానీ ఈసారి ఆ వార్త కాస్త స్ట్రాంగ్‌గా రావడంతో వారి అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. దానికి కారణం వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వార్తలో ఉండడమే..!

Last Updated : Dec 9, 2017, 07:19 PM IST
కోహ్లీ.. అనుష్క పెళ్లి వార్త; ఈసారైనా నిజమేనా!?

ముంబై: కోహ్లీ-అనుష్క పెళ్లి వార్త వారు ప్రేమించుకుంటున్నప్పటి నుండీ చక్కర్లు కొడుతోంది. కానీ ఈసారి కాస్త స్ట్రాంగ్‌గా చక్కర్లు కొట్టింది. దానికి కారణం వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వార్తలలో ఉండడమే..!

వివరాల్లోకి వెళితే..

అనుష్క శుక్రవారం మధ్యాహ్నం ముంబై ఎయిర్ పోర్ట్‌లో తల్లితండ్రులు, సోదరుడితో కనిపించింది. మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వారందరూ ఎక్కడికి వెళ్లారో సమాచారం గోప్యంగా ఉంచారు. అయితే డిసెంబర్ 12న ఇటలీలోని మిలాన్ లో కోహ్లీ-అనుష్క ఒక్కటి కానున్నారని.. అత్యంత సన్నిహితుల సమక్షంలో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొందరు అంటున్నారు. దీనికి బలం చేకూర్చే కారణాలూ లేకపోలేదు. 

* కొన్నేళ్ల క్రితం డెహ్రాడూన్‌లో వారిద్దరినీ ఆశీర్వదించిన పురోహితుడు విమానం ఎక్కేందుకు రావడం పెళ్లి వార్తలో కాస్త నిజం కావొచ్చని ఒక అంచనా. 

* కీలక మ్యాచ్ సమయంలో కోహ్లీ సెలవు కోరడం.. ఆయన సెలవు తీసుకున్న రోజే కోహ్లీ తన మిత్ర బృందంతో మిలాన్‌కు వెళుతుండడంతో పెళ్లి వార్తలకు కాస్త ఊతమిచ్చింది.

* నటి అనుష్క తరఫున ఆహ్వాన పత్రాలు కొందరు సన్నిహితులకు అందాయని కూడా సమాచారం. 

* మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌ లను మాత్రమే కోహ్లీ వివాహానికి ఆహ్వానించాడని కూడా వార్తలు వస్తున్నాయి

* షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, మనీష్ శర్మ, ఆదిత్య చోప్రాలను అనుష్క తన పెళ్ళికి ఆహ్వానించారని వార్తలు వస్తున్నాయి.

శుక్రవారం తెల్లవారుఝామున ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో కోహ్లీ స్విట్జర్లాండ్ ఫ్లైట్ ఎక్కడానికి వచ్చాడు. ఆ సమయంలో ఆయన ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నట్లు... ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. కోహ్లీ-అనుష్క స్విట్జర్లాండ్‌లో కలుసుకొని మిలాన్ చేరుకుంటారని కూడా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ  తన పెళ్లి గురించి తన సహచరులకు కూడా చెప్పలేదట.

పెళ్లి తరువాతనే అన్ని విషయాలను అధికారికంగా దంపతులు ప్రకటిస్తారని సమాచారం. అప్పుడే విందులు.. వినోదాలు అని కూడా అంటున్నారు. పెళ్లి చేసుకొని వచ్చాక.. టీమిండియా సౌత్ ఆఫ్రికా టూర్‌కు బయలుదేరి వెళ్లేముందు కోహ్లీ ముంబైలో గ్రాండ్‌గా పార్టీ ఇవ్వనున్నట్లు సన్నిహితులు చెప్పారు. ఈ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు.

ఏది ఏమైనా సోషల్ మీడియాలో మరో సారి విరుష్క జోడీ (విరాట్ కోహ్లీ- అనుష్క జోడీ) పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టడం గమనార్హం. విరాట్, అనుష్కల సన్నిహితులు, కుటుంబసభ్యులు మిలాన్‌కు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం చూస్తుంటే.. అక్కడ ఏదో ఒక ప్రోగ్రాం అయితే జరుగుతోందని.. అది పెళ్ళైనా కావచ్చు.. లేదా ఎంగేజ్మెంట్ అయినా కావచ్చు అని ఇంకొందరు అంటున్నారు. ఈ వార్త గాసిప్పో లేక నిజమో తెలియాలంటే ఇంకా రెండు రోజులు ఆగాల్సిందే..!

Trending News