ధోనీ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్‌కి విరాట్ కోహ్లీ మద్దతు

రిషబ్ పంత్‌కి విరాట్ కోహ్లీ మద్దతు

Last Updated : Aug 4, 2019, 03:28 PM IST
ధోనీ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్‌కి విరాట్ కోహ్లీ మద్దతు

వెస్టిండీస్ పర్యటనకు మహేంద్ర సింగ్ ధోని దూరంగా ఉన్న నేపథ్యంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ తన ప్రతిభను మెరుగుపర్చుకుని, తనను తాను నిరూపించుకోవడానికి మంచి అవకాశం దొరికిందని టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో శనివారం తొలి టీ20 ఆడనున్న నేపథ్యంలో ఫోర్ట్ లాడర్డేల్‌లో విలేకరులతో మాట్లాడుతూ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ధోనీ తర్వాత టీమిండియా వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపట్టడానికి రిషబ్ పంత్‌(21)నే సరైన ఎంపిక అని బీసీసీఐ భావిస్తున్న సంగతి తెలిసిందే.      

టెరిటోరియల్ ఆర్మీకి సేవలు అందించే ఉద్దేశంతో క్రికెట్ కెరీర్ నుంచి రెండు నెలలు సెలవు తీసుకున్న ధోని ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తూ బిజీగా ఉన్నాడు.

Trending News