ఆసీస్ బౌలర్ల గుండెల్లో కోహ్లీ భయం ; సచిన్, లారా కంటే డేంజర్ అని కామెంట్స్

 ఒకప్పడు ఆసీస్ పర్యటన అంటే టీమిండి భయపడే పరిస్థితి ఉండేది..కానీ ఇప్పుడు సీన్ రివర్స్..కోహ్లీ సేన వస్తుంటే ఆసీస్ క్రికెటర్లకు వణుకుపుడుతోంది

Last Updated : Nov 15, 2018, 08:09 PM IST
ఆసీస్ బౌలర్ల గుండెల్లో కోహ్లీ భయం ; సచిన్, లారా కంటే డేంజర్ అని కామెంట్స్

మరి కొన్ని రోజుల్లో ఆసీస్ లో కోహ్లీసేన పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఆస్త్రేలియా బౌలర్లకు  కోహ్లీ ఫీవర్ వచ్చింది. అతని ఆటతీరు గుర్తు చేసుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. సచిన్, లారా లక్ష్మణ్ కంటే కోహ్లీ యమ డేంజర్ అని సీనియర్ల నుంచి తెగ కామెంట్స్ వస్తున్నాయి. 

కోహ్లీ గురించి ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవా మాట్లాడుతు సచిన్, లారా లాంటి గొప్ప ఆటగాళ్ల సరనన కోహ్లీ ఉన్నాడని కితాబిచ్చారు.  కోహ్లీ లాంటి ఆటగాడు ఉన్నందుకు ఆసీస్ గడ్డపై భారత్ కు గెలిచే సువర్ణ అవకాశం వచ్చిందని..దీన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుంటుందో లేదా చూడాల్సి ఉందని పేర్కొన్నాడు.  

ఈ సందర్భంగా న్యూజిలాండ్ కోచ్ మైక్ హేసన్ మాట్లాడుతూ సచిన్, లారా లాంటి మహాక్రికటర్ల కంటే కోహ్లీ  డేంజర్ ఆటగాడని ..అతన్ని కట్టడి చేసే సరైన ఫార్మలా లేదంటే ..ఇక సిరీస్ పై ఆశలు వదులుకోవాల్సిందేనని ఆసీస్ కు వార్నింగ్ ఇచ్చాడు

కోహ్లీ తన దూకుడైన ఆటతో చాలా తక్కువ సమయంలో ఎక్కువ మంది అభిమానులు సంపాదించుకున్నాడని గ్లెన్ మెక్ గ్రాత్ ప్రశంసించాడు. సచిన్ లాగా సెంచరీలు చేయడం సమకాలిన క్రికెట్ లో కోహ్లీ ఒక్కడే ఉన్నాడని పేర్కొన్నాడు. అతని ఆటతీరు అంచనా వేసి బౌలింగ్ చేయడం కష్టతరమైందని మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డారు.

అతనికి సాధారణ అభిమానులే కాదు.. క్రికెటర్లలో కూడా అభిమానులు ఉన్నారని దిగ్గజ స్నిన్నర్ షేన్ వార్న్ పేర్కొన్నాడు.  కోహ్లీని అభిమానించే వారిలో తానూ ఒకడినని ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ సేన్ వార్న్ వ్యాఖ్యానించడ గమనార్హం.

ఇలా చెప్పుకుంటే పోతే ఆసీస్ నుంచి న్యూజీలాండ్ ఆటగాళ్లందరూ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరి కోహ్లీ అంచనా తగ్గుట్టుగా ఆటతీరు కనబర్చితే ఆసీస్ గడ్డపై సిరీస్ గెలవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
 

Trending News