Chris Gayle: 'ప్రధాని మోదీ మెసేజ్ తో నిద్ర లేచా'..: క్రిస్‌ గేల్‌

Chris Gayle:  ప్రధాని మోదీ తనకు వ్యక్తిగత సందేశం పంపారని వెస్టిండీస్ బ్యాటర్​ క్రిస్​గేల్ చెప్పాడు​. ఈ సందర్భంగా భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 01:17 PM IST
  • వ్యక్తిగతంగా నాకు మెసేజ్ చేశారు
  • మోదీ, భారత ప్రజలతో నాకు మంచి అనుబంధం
  • తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపిన గేల్
Chris Gayle: 'ప్రధాని మోదీ మెసేజ్ తో నిద్ర లేచా'..: క్రిస్‌ గేల్‌

PM Narendra Modi-Chris Gayle: వెస్టిండీస్​ విధ్వంసకర బ్యాటర్, యూనివర్సల్ బాస్​ క్రిస్​గేల్ (Chris Gayle)​.. భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నుంచి తనకు వ్యక్తిగత సందేశం వచ్చిందని ట్వీట్​ చేశాడు. అదే విధంగా ప్రధాని మోదీ..దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ (Jonty Rhodes) కు మెసేజ్ పంపారు. 

 " భారతీయులకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధాని నరేంద్ర మోదీ పంపిన పర్సనల్‌ మెసేజ్‌తో ఈరోజు నిద్ర లేచా. ఆయనతో సహా దేశప్రజలందరితో నాకు మంచి అనుబంధం ఉంది. యూనివర్స్​ బాస్​ నుంచి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అంటూ గేల్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. 

Also read: Yuvraj Singh-Hazel Keech: తండ్రయిన యువరాజ్ సింగ్... పండంటి బిడ్డకి జన్మనిచ్చిన హేజెల్ కీచ్..

క్రిస్‌ గేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్‌ తరపున 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టి20లు ఆడాడు. ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, పంజాబ్​ కింగ్స్​కు ప్రాతినిధ్యం వహించిన గేల్ (Chris Gayle)​ తన అద్భుతమైన బ్యాటింగ్​తో మన దేశంలో విపరీతమైన క్రేజ్​ సంపాదించుకున్నాడు. దీనిలో ఆర్‌సీబీ తరపున 91 మ్యాచ్‌ల్లో 3420 పరుగులు సాధించాడు. కోహ్లి, డివిలియర్స్‌ తర్వాత ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా గేల్‌ నిలిచాడు. అయితే ఈ సారి ఐపీఎల్ (IPL) కు గేల్ దూరమయ్యాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News