Flipkart Big Diwali sale: ఐఫోన్లపై దీపావళి డిస్కౌంట్స్ జాతర

Flipkart Big Diwali sale: మీకిష్టమైన ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్స్ జాతర నడుస్తోంది. ఐఫోన్ 13, ఐఫోన్ 12 మిని, ఐఫోన్ 11లపై భారీ డిస్కౌంట్లు అందుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 10, 2022, 10:24 PM IST
Flipkart Big Diwali sale: ఐఫోన్లపై దీపావళి డిస్కౌంట్స్ జాతర

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ ఇంకా అందుబాటులో ఉంది. అయితే కేవలం ప్లస్ సభ్యులకు మాత్రం ఇప్పుడు అవకాశముంది. మిగిలిన అందరికీ ఇవాళ రాత్రి నుంచి అక్టోబర్ 16 వరకూ ఫ్లిప్‌కార్ట్ సేల్ అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై, యాపిల్ ఐఫోన్లపై ఏకంగా 80 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ ఉందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. 

ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ అందించిన వివరాల ప్రకారం యాపిల్ ఐఫోన్ 13లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 58,990 రూపాయలకు లిస్ట్ అయుంది. బ్యాంక్ ఆఫర్ల ప్రకారం మరో 2000 రూపాయలు డిస్కౌంట్ ఉంది. ఐఫోన్ 13 అనేది యాపిల్ ఏ15 బయోనిక్ చిప్‌సెట్ సపోర్ట్ ప్రత్యేకత. ఐఫోన్ 14లో కూడా అదే ఉంది. ఐఫోన్ 13 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో వస్తుంది. 

యాపిల్ ఐఫోన్ 12 మిని ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ సందర్భంగా కేవలం 33,740 రూపాయలకే లభించనుంది. ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఉంటుంది. 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీవాళి సేల్ సందర్భంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఒప్పో రెనో 8 5జిపై ఎక్స్చేంజ్ ధర 16,900 రూపాయలు, రియల్ మి 9 ప్రో ప్లస్ 5జిలో 18,900 రూపాయలు లభిస్తాయి. మరోవైపు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ 99 రూపాయలతో ప్రారంభమౌతుంది. 

Also read: Airtel 5G Network: మీరు ఎయిర్‌టెల్ కస్టమరా ? మీ ఫోన్‌లో 5జి ఎలా వస్తుందో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News