Flipkart iPhone 14 Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు, కేవలం 12,500 రూపాయలకే

Flipkart iPhone 14 Offers: ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. 70 వేల ఐఫోన్ 14 కేవలం 12,500 రూపాయలకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న వివిధ రకాల ఆఫర్లతో ఐఫోన్ 14ను నమ్మశక్యం కాని ధరకు పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2024, 06:50 PM IST
Flipkart iPhone 14 Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు, కేవలం 12,500 రూపాయలకే

Flipkart iPhone 14 Offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై ఊహించని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 మార్కెట్‌లో వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా డిమాండ్ మాత్రం తగ్గలేదు. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామంది వెనుకంజ వేస్తున్నారు. కానీ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు అందుకుంటే మాత్రం అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌పై ఐఫోన్ 14లో 128 జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 69,900 రూపాయలకు లిస్టింగ్ అయి ఉంది. దీనిపై కంపెనీ నుంచి 13, 901 రూపాయలు డిస్కౌంట్ నడుస్తోంది. అంటే ఈ డిస్కౌంట్ మినహాయిస్తే ఐఫోన్ 14 కేవలం 55, 999 రూపాయలైంది. అయితే ఇది కాకుండా ఇంకా కొన్ని ఆఫర్లు, ఎక్స్చేంజ్ పధకాలు వర్తించనున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా సిటీ బ్యాంక్ క్రెడిట్ కానీ డెబిట్ కార్డు కానీ వినియోగించి కొనుగోలు చేస్తే అదనంగా 1500 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఇప్పుడు ఐఫోన్ 14 ధర 54, 999 రూపాయలైంది. 

ఫ్లిప్‌కార్ట్ చాలావరకూ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తోంది. అదే విధంగా ఐఫోన్ 14 కొనుగోలులో పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ ఇస్తే 42 వేల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ ఎక్స్చేంజ్ అనేది మీరు ఇచ్చే పాత స్మార్ట్‌ఫోన్ కంపెనీ, మోడల్, ధర, కండీషన్ ఆధారంగా నిర్ణయమౌతుంది. మీరిచ్చే స్మార్ట్‌ఫోన్‌పై పూర్తి ఆఫర్ 42 వేలు వర్తిస్తే..కేవలం 12,499 రూపాయలకే స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు.

Also read: Post Office Superhit Scheme: పోస్టాఫీసు సూపర్ హిట్ స్కీములో చేరితే నెలకు 20 వేలు ఆదాయం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News