Flipkart: ఫ్లిప్‌కార్ట్ నుంచి త్వరలో కొత్త ఫీచర్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం ప్రారంభం

Flipkart: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో కొత్త సర్వీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వివిధ రకాల సేవలతో కస్టమర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఫ్లిప్‌కార్ట్ మరో ఫీచర్ ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ లాభాలేంటో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 25, 2023, 07:09 PM IST
Flipkart: ఫ్లిప్‌కార్ట్ నుంచి త్వరలో కొత్త ఫీచర్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం ప్రారంభం

Flipkart: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ వ్యాపారానికి ఆదరణ ఎక్కువగా ఉంటోంది. అందుకే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే, అలీబాబా వంటి దిగ్గజ కంపెనీలతో పాటు ఇతర చాలా కంపెనీలు రంగంలో ఉన్నాయి. పోటీ తట్టుకునేందుకు వివిధ ఈ కామర్స్ వేదికలు వేర్వేరు ఆఫర్లు, ఫీచర్లు అందుబాటులో తీసుకొస్తుంటారు.

ఈ కామర్స్ వేదికలు అందుబాటులోకి వచ్చాక ప్రత్యక్ష షాపింగ్ చాలా వరకూ తగ్గిపోయిందనే చెప్పాలి. స్టోర్ల ధరలకు ఈ కామర్స్ వేదికల్లో ధరలకు తేడా ఉన్నా లేకపోయినా ఇంట్లో కూర్చుని నచ్చిన వస్తువు షాపింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో ఈ కామర్స్ వేదికలకు ఆదరణ పెరుగుతోంది. ఈ కామర్స్ వేదికల్లో ప్రధానంగా పోటీ పడేది ఫ్లిప్‌కార్డ్, అమెజాన్‌లు. ఈ రెండు వేదికలు ఎప్పటికప్పుడు వివిధ రకాల ఫీచర్లు, డిస్కౌంట్ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగానే అమెజాన్‌ను దీటుగా ఎదుర్కొంటున్న భారతీయ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త ఫీచర్ అందబాటులో తీసుకొస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ కొత్తగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం అనే సర్వీస్ ప్రారంభించనుంది. ఇప్పటికే ఉన్న ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌కు ఇది భిన్నమైందే కాకుండా అదనపు ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఫ్లిప్‌కార్డ్ ప్లస్ ప్రీమియం ఫీచర్ కోసం యూజర్లు లేదా కస్టమర్లు అదనంగా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తి ఉచితంగా లభించే సర్వీస్ ఇది. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ఫీచర్‌కు అదనంగా చేరుతున్న సర్వీస్ ఇది. ఈ కొత్త సర్వీస్ ‌కస్టమర్లకు అదనంగా ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి, ఎలాంటి ఫీచర్లు ఉంటాయనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరో 2-3 వారాల్లో ఈ కొత్త ఫీచర్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం లాంచ్ కావచ్చని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌లో ఉచిత డెలివరీ, సూపర్ కాయిన్ కలెక్షన్, వివిధ డీల్స్‌కు ముందస్తుగా యాక్సెస్, ప్రయారిటీ కస్టమర్ సపోర్ట్ వంటి సేవలు లభిస్తున్నాయి.ప్రతి వంద రూపాయల కొనుగోలుపై నాలుగు సూపర్ కాయిన్స్ లభిస్తాయి. 

త్వరలో అంటే వచ్చే నెలలో ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించనున్న ఇండిపెండెన్స్ డే సేల్‌తో పాటు ఈ కొత్త ఫీచర్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ప్రీమియం లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. కొత్త ఫీచర్‌ను ఎక్కువమందికి చేరువయ్యేలా చేయాలాంటే ఇండిపెండెన్స్ డే సేల్ సరైన సందర్భమని కంపెనీ భావిస్తోంది.

Also read: IRCTC Server Down: ఐఆర్‌సీటీసీ సర్వర్ డౌన్.. టికెట్‌ బుకింగ్స్‌కు అంతరాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News