Nokia C22 Price: నొకియా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ సూపర్, ధర తక్కువే

Nokia C22 Price, Features: కేవలం రూ. 7,999 ధరకే ఈ ఫోన్‌ని లాంచ్ చేసిన నోకియా.. ఇందులో రెండు వేరియంట్స్‌ని తీసుకొచ్చింది. మే 11 నుంచి.. అంటే ఇవాళ్టి నుంచే నోకియా సీ22 ఫోన్స్ అమ్మకాలు మొదలుకానున్నాయి. 

Written by - Pavan | Last Updated : May 11, 2023, 05:35 PM IST
Nokia C22 Price: నొకియా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ సూపర్, ధర తక్కువే

Nokia C22 Price, Features: ఒకప్పుడు మొబైల్ ఫోన్స్ మార్కెట్‌ని తిరుగులేని రారాజులా ఏలిన నోకియా.. స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగాకా శాంసంగ్, రెడ్‌మి వంటి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చిన గట్టి పోటీతో వెనుకబడిపోయింది. ఈమధ్యే మళ్లీ కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ని లాంచ్ చేస్తూ మళ్లీ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న నోకియా తాజాగా నోకియా C22 పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. 

కేవలం రూ. 7,999 ధరకే ఈ ఫోన్‌ని లాంచ్ చేసిన నోకియా.. ఇందులో రెండు వేరియంట్స్‌ని తీసుకొచ్చింది. అందులో ఒకటి 4GB (2GB + 2GB వర్చువల్ RAM) కాగా మరొకటి 6GB (4GB + 2GB వర్చువల్ RAM) తో వస్తోంది. రెండింటిలోనూ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం కల్పించింది. మే 11 నుంచి.. అంటే ఇవాళ్టి నుంచే నోకియా సీ22 ఫోన్స్ అమ్మకాలు మొదలుకానున్నాయి. 

నోకియా C22 లాంచ్ సందర్భంగా నోకియా ప్రోడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గ్యూసన్ మాట్లాడుతూ.. నోకియా బ్రాండ్ అంటేనే నాణ్యతకు, దీర్ఘకాలం మన్నికకు మారు పేరని.. అలాగే ఈ నోకియా సీ 22 ఫోన్‌ని కూడా అలాగే తయారు చేయడం జరిగింది అని స్పష్టంచేశారు. ఆహ్లాదకరమైన యూజర్ ఎక్స్‌పీరియెన్స్ కోసం, దీర్ఘకాలం మన్నిక కోసం నోకియా సీ22 ది బెస్ట్ ఆఫ్షన్ అని ఆడమ్ ఫెర్గ్యూసన్ స్పష్టంచేశాడు. 

పవర్‌ఫుల్ బ్యాటరీ 
నోకియా C22 స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh శక్తిసామర్థ్యాలు కలిగిన బ్యాటరీని అమర్చారు. సింగిల్ చార్జింగ్‌తో ఇది మూడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ని అందిస్తుంది అని నోకియా స్పష్టంచేసింది.

నోకియా C22 స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విషయానికొస్తే.. 
నోకియా C22 స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో రెండు 13MP కెమెరాలు ఉండగా.... ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫోటో, వీడియో క్వాలిటీ కోసం కెమెరాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఇమేజింగ్ అల్గారిథమ్స్ ఉపయోగించినట్టు నోకియా వెల్లడించింది.

ఇక మిగతా ఫీచర్స్ విషయానికొస్తే.. ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 ( గో ఎడిషన్ ) ఆపరేటింగ్ సిస్టంతో నోకియా C22 స్మార్ట్‌ ఫోన్‌ రన్ అవుతుంది. 6.5 ఇంచెస్ HD+ డిస్‌ప్లేని అమర్చారు. డ్రాప్ ప్రొటెక్షన్ పరంగానూ నోకియా C22 ఫోన్ మరింత ధృడమైనది అని నోకియా కంపెనీ చెబుతోంది. తక్కువ బడ్జెట్లో వచ్చే బెస్ట్ స్మార్ట్‌ ఫోన్స్‌లో ఇది కూడా ఒకటిగా నిలవనుందని.. అలాగే లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లలో నోకియా C22 తన మార్క్ చూపించుకుంటుంది అని నోకియా ఆశిస్తోంది.

Trending News