iPhone 15 Jio Special Offer: ఐఫోన్ 15పై జియో స్పెషల్ ఆఫర్

iPhone 15 Jio Special Offer:  ఐఫోన్ 15ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న వాళ్లంతా ఎక్కడ, ఎలాంటి బెస్ట్ ఆఫర్స్ , బెస్ట్ డీల్స్ ఉన్నాయా అని అన్వేషిస్తున్నారు. అలా బెస్ట్ ప్రైస్‌కి, బెస్ట్ డీల్‌కి ఐఫోన్ సొంతం చేసుకోవాలని చూస్తున్న వారి కోసం రిలయన్స్ సంస్థ ఓ కొత్త కాంప్లిమెంటరీ ప్లాన్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2023, 01:54 AM IST
iPhone 15 Jio Special Offer: ఐఫోన్ 15పై జియో స్పెషల్ ఆఫర్

iPhone 15 Jio Special Offer: ఎప్పటి నుండో ఐఫోన్ లవర్స్‌ని ఊరిస్తూ వస్తోన్న ఐఫోన్ 15 లాంచ్ అయిన నేపథ్యంలో ఆ ఫోన్‌ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న వాళ్లంతా ఎక్కడ, ఎలాంటి బెస్ట్ ఆఫర్స్ , బెస్ట్ డీల్స్ ఉన్నాయా అని అన్వేషిస్తున్నారు. అలా బెస్ట్ ప్రైస్ కి ఐఫోన్ సొంతం చేసుకోవాలని చూస్తున్న వారి కోసం రిలయన్స్ సంస్థ ఓ కొత్త కాంప్లిమెంటరీ ప్లాన్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. రిలయన్స్ డిజిటల్, జియో మార్ట్ లేదా రిలయన్స్ రీటేల్ స్టోర్స్‌లో ఐఫోన్ సేల్స్ పెంచుకునేందుకు ప్లాన్ చేసిన రిలయన్స్.. తమ స్టోర్స్ లో ఐఫోన్ 15 కొనుగోలు చేసే వారి కోసం ఓ కాంప్లిమెంటరీ ఆఫర్ ని ప్రకటించింది. 

రిలయన్స్ డిజిటల్, జియో మార్ట్ లేదా రిలయన్స్ రీటేల్ స్టోర్స్ లో iPhone 15 కొనుగోలు చేసిన వారు రిలయన్స్ జియో హై స్పీడ్ డేటాపై బ్రౌజింగ్, బింగ్ వాచింగ్ ఎంజాయ్ చేసేలా నెలకు రూ. 399 కే ప్రతీ రోజూ 3GB డేటా అందించనుంది.

యాపిల్ సంస్థ ఒక వారం రోజుల ముందు నుండే ఐఫోన్ 15 మొబైల్ ప్రీబుకింగ్ ఆర్డర్స్ స్వీకరించడం మొదలుపెట్టిన తరువాత స్టోర్స్ లో నేరుగా సేల్ చేయడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 15 సేల్ మొదలయ్యాకా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఐఫోన్ 15 అమ్మకానికి సంబంధించిన వార్తలు, దృశ్యాలు, ఆఫర్స్ గురించే పోస్టులు వైరల్ అవుతూ దర్శనం ఇస్తున్నాయి. 

అందులో భాగంగానే రిలయన్స్ జియో కూడా ఈ ఆఫర్ తీసుకొచ్చింది. రిలయన్స్ డిజిటల్, జియోమార్ట్ లేదా రిలయన్స్ రిటైల్ స్టోర్‌లలో ఐఫోన్ 15ని కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ఆఫర్‌ కింద రూ. 2,394
వరకు లబ్ధి చేకూరేలా జియో టారిఫ్ ప్లాన్ చేసింది.

నెలకు రూ. 399కి కాంప్లిమెంటరీ ప్లాన్ కింద రీచార్జ్ చేసుకున్న వారికి ప్రతీ రోజూ 3GB డేటాను అందిస్తోంది. ఈ జియో రూ. 399 టారిఫ్ రీచార్జ్ ప్లాన్ ఐఫోన్ 15 కొనుగోలు చేసిన మొదటి 6 నెలల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని.. తద్వారా మొత్తం రూ. 2,394 వరకు ప్రయోజనం లభిస్తుందని జియో స్పష్టంచేసింది.

Trending News