Whatsapp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. సూపర్ ఫీచర్ వచ్చేసింది

Whatsapp Message Yourself: ఎంతోమంది వినియోగదారులు ఎదురుచూస్తున్న అప్‌డేట్ వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చింది. మెసేజ్ యువర్ సెల్ఫ్‌ ఆప్షన్‌ను పరిచయం చేసింది. ఈ సదుపాయంతో వినియోగదారులకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2023, 02:40 PM IST
Whatsapp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. సూపర్ ఫీచర్ వచ్చేసింది

Whatsapp Message Yourself: ప్రస్తుతం సోషల్ మీడియా యాప్‌ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఉదయం నిద్ర లేవడం మొదలు.. రాత్రి కనురెప్ప మూసేవరకు చాలా మంది సోషల్ మీడియాలోనే మునిగి తేలుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్, ఇన్స్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లలో చాటింగ్‌లతో బిజీగా మారిపోయారు. వీటిలో ఎక్కువమంది యూజర్లు వాడుతున్న యాప్ మాత్రం వాట్సాప్. ఈ యాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో యూజర్లకు కొత్త అనుభూతిని ఇస్తోంది. తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. ఈ సేవ కోసం ఎంతోమంది యూజర్లు చాలా రోజులు ఎదురుచూస్తున్నారు.  

తాజా అప్‌డేట్‌ మెసేజ్ యువర్ సెల్ఫ్‌లో వాట్సాప్‌లో వినియోగదారులు తమకు తామే సందేశాలు పంపుకోవచ్చు. ఈ సదుపాయంతో అనేక రకాల పనులు చేసుకోవచ్చు. గుర్తుంచుకోవడానికి నోట్స్ తయారు చేయడం, చేయవలసిన జాబితాలను తయారు చేయడం, షాపింగ్ జాబితాలు వంటివి సిద్ధం చేసుకుని మెసేజ్ పెట్టుకోవచ్చు. ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. టెక్ట్స్ మెసేజ్ మాత్రమే కాకుండా.. మీకు మీరు వాయిస్ మెమోలను కూడా పెట్టుకోవచ్చు. 

మీ నంబరుకే మీరు వాట్సాప్ సందేశం పంపాలనుకుంటే.. మీరు మెనుని తెరిచి కాంటాక్ట్‌లకు వెళ్లాలి. మీ పేరు ఆ జాబితాలో ఎగువన కనిపిస్తుంది. మీరు దానిపై నొక్కడం ద్వారా సందేశం పంపవచ్చు. మరేదైనా డివైజ్‌లో వాట్సాప్ ఓపెన్ చేసినా.. ఈ మెసేజ్‌లు కనిపిస్తాయి. మీరు ఈ ఫీచర్‌ని ఉపయోగించాలనుకుంటే మీకు స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ అవసరం. మీ ల్యాప్‌టాప్‌లో web.whatsapp.com/కి వెళ్లండి. మీ వాట్సాప్‌లో మీకు ఈ ఫీచర్ కనిపించకపోతే.. మీ యాప్‌ను అప్‌డేట్ చేయండి. 

ఈ ఫీచర్ కోసం వాట్సాప్ యూజర్లు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమైన సమాచారాన్ని నోట్ ప్యాడ్‌లో సేవ్ చేసుకుని డిలీట్ అయితే ఇబ్బంది పడేవారు. తాజాగా అప్‌డేట్‌తో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలను తమ నంబరుకే సెండ్ చేసుకోవచ్చు. తాము చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు రివైండ్ చేసుకోవచ్చు. 

Also Read: China Dam: సరిహద్దులో చైనా మాస్టర్ ప్లాన్.. సీక్రెట్‌గా ఆనకట్ట నిర్మాణం  

Also Read: Kadapa Road Accident: ఆగి ఉన్న లారీ ఢీకొన్న టెంపో.. ముగ్గురు మహిళలు మృతి, 8 మందికి తీవ్రగాయాలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News