Lift Accident in siddipet: తెగిపడ్డ లిఫ్టు.. 20మందికి గాయాలు, ముగ్గురికి సీరియస్!

Lift Accident: సిద్దిపేట జిల్లాలో లిప్టు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 04:19 PM IST
  • మెడికల్ కళాశాలలో లిఫ్టు ప్రమాదం
  • 20 మందికి గాయాలు, ముగ్గురికి సీరియస్
  • సిద్దిపేట జిల్లాలో ఘటన
Lift Accident in siddipet: తెగిపడ్డ లిఫ్టు.. 20మందికి గాయాలు, ముగ్గురికి సీరియస్!

Lift Accident in Siddipet: తెలంగాణలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లాలోని జరిగిన లిప్టు ప్రమాదంలో (Lift Accident in Siddipet) 20మంది గాయపడ్డారు. ఈ ఘటన ములుగు మండలం లక్ష్మక్కపల్లెలో ఉన్న ఆర్‌వీఎం వైద్య కళాశాలలో జరిగింది. 

ఆర్‌వీఎం వైద్య కళాశాలలో (rvm medical college) ప్రమాదవశాత్తు లిప్టు తెగిపడింది. తీగలు తెగడంతో ఒక్కసారిగా పైఅంతస్తు నుంచి లిప్టు కిందపడింది. ఈ ఘటనలో 20మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉంది. దీంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Also Read: Crime News: పెద్దల్ని ఒప్పించలేక.. ఒకరికి దూరంగా మరొకరు ఉండలేక.. చావుతో ఒకటైన ప్రేమజంట!!

పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామపరిధిలో ఉన్న సవారియా ఇనుపపైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం (Accident In Iron pipes company) చోటుచేసుకుంది. క్రేన్‌ సహాయంతో ఇనుపరాడ్లు తీసుకెళుతున్న సమయంలో.. బరువు ఎక్కువై వైరు తెగిపోయింది. ఒక్కసారిగా ఇనుపరాడ్లు అక్కడే పనిచేస్తున్న కార్మికులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లు నలుగురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News