Telangana Scam: తెలంగాణలో మరో భారీ కుంభకోణం.. రూ.4 కోట్ల నిధులు మాయం!

Telangana Scam: తెలుగు అకాడమీ తరహలోనే తెలంగాణ గిడ్డంగుల శాఖలో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణం వెలుగుచూసింది. ఈ స్కాంలో రూ.4 కోట్ల నిధులు గల్లంతు అయినట్లు తెలుస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 12:39 PM IST
  • తెలంగాణలో మరో భారీ స్కాం
  • గిడ్డంగుల శాఖలో నిధులు మాయం
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Telangana Scam: తెలంగాణలో మరో భారీ కుంభకోణం.. రూ.4 కోట్ల నిధులు మాయం!

Telangana warehousing department Scam news: తెలంగాణలో మరో భారీ స్కాం (Scam) బయటపడింది. తెలుగు అకాడమీ కేసు (Telugu academy Case) తరహాలో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ గిడ్డంగుల శాఖలో (Telangana warehousing department) భారీగా ఫిక్సడ్ డిపాజిట్ నిధులు మాయం అయ్యాయి. రాష్ట్ర గిడ్డంగుల శాఖకు చెందిన రూ.4 కోట్ల నిధులు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. తప్పుడు ఎఫ్‌డీ పత్రాలు చూపించి కార్వాన్ యూనియన్ బ్యాంక్ నుంచి ఫిక్సుడ్ డిపాజిట్ నిధులను కొల్లగొట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. 

ఈ స్కాంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా తెలుగు అకాడమీ కేసు ముఠా పనేనని అనుమానిస్తున్నారు. అంతేకాదు.. బ్యాంకు అధికారుల పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీఎస్‌లో గిడ్డంగుల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ దర్యాప్తును వేగ వంతం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు.

Also Read: వేములవాడ ముస్లిం మత పెద్దల సంచలన తీర్మానం... ఇకపై పెళ్లిళ్లలో ఒకే కూర, ఒకే స్వీటు

ఇటీవల తెలంగాణలోని తెలుగు అకాడమీ కేసు (Telugu academy) పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తెలుగు అకాడమీకి చెందిన రూ.60కోట్లకు పైగా  ఫిక్స్ డ్ డిపాజిట్లు పలు బ్యాంకుల్లో ఉన్నాయి. అయితే అకాడమీ అధికారులకు తెలియకుండానే నిధులు డ్రా చేయడం కలకలం రేపింది.  అసలైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాల ద్వారా నగదును డ్రా చేసుకొని నకిలీ ఫిక్స్ డ్ డిపాజిట్ పత్రాలను బ్యాంకుల వద్ద ఉంచినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ కేసులో బ్యాంకు అధికారులు, తెలుగు అకాడమీలో పనిచేసిన కొందరి పాత్ర కూడా ఉందని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News