BJP Changes: తెలంగాణ బీజేపీలో మార్పులు, కిషన్ రెడ్డికి బాధ్యతలు ?

BJP Changes: తెలంగాణ బీజేపీలో మార్పులు తధ్యమనే తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ విషయంపై హైప్ నెలకొన్నా అధిష్టానం మాత్రం పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగించే దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 4, 2023, 01:05 AM IST
BJP Changes: తెలంగాణ బీజేపీలో మార్పులు, కిషన్ రెడ్డికి బాధ్యతలు ?

BJP Changes: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 8 నెలల ముందు బీజేపీ అధిష్టానం తెలంగాణలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే పార్టీ పగ్గాలు బండి సంజ.్ చేతి నుంచి మరో వ్యక్తి చేతికి అందనున్నాయి.  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

2024లో లోక్‌సభ ఎన్నికలు, 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ ఏడాది మరో 4 నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చేందుకు కేంద్ర నాయకత్వం సిద్దమైనట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో 12 మంది సీనియర్ మంత్రులకు ఆ పార్టీ అధిష్టానం ఉద్వాసన పలికింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను మార్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది. ఈటెల రాజేందర్ కు బీజేపీ ప్రచార సారధ్య బాధ్యతలు అప్పగించవచ్చు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ సంస్థాగత మార్పులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. కిషన్ రెడ్డికి బీజేపీ సారధ్య బాధ్యతలు అప్పగించడమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అంశాన్ని కూడా బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. అదే సమయంలో బీసీ సీఎం అభ్యర్ధి ప్రకటన ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. కేంద్ర మంత్రి పదవి వదులుకుని రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం కిషన్ రెడ్డికి ఇష్టం లేనట్టు తెలుస్తోంది. అందుకే కేవలం పార్టీ అధ్యక్ష బాధ్యతలకు పరిమితం చేయకుండా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే అంశం పరిశీలనో ఉంది. 

ఇదే జరిగితే బండి సంజయ్ పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. అటు పార్టీ ఎమ్మల్యేలు ఈటెల రాజేందర్, రఘునందర్ రావులకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సరిపడక పోవడం కూడా ఓ కారణం. అయితే రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కేవలం తెలంగాణకే కాకుండా త్వరలో ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లోనూ ఉండవచ్చని తెలుస్తోంది. బీసీ సీఎం అభ్యర్ధి ప్రకటన అంశాన్ని కూడా పరిశీలిస్తున్న బీజేపీ ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో 50 శాతం పైగా ఉన్న బీసీలను ఆకట్టుకునేందుకు బీసీ సీఎం అస్త్రం పనిచేస్తుందా లేదా అనే విషయంపై వాదన కొనసాగుతోంది.

Also read: Rs 4000 Old Age Pension: తెలంగాణలో రూ. 4 వేల వృద్ధాప్య పెన్షన్.. బీఆర్ఎస్‌కి గట్టి దెబ్బ పడనుందా ?

;స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News